బిగ్ బాస్ మూడో సీజన్ 19వ ఎపిసోడ్ లో అలీ, పునర్నవిలకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేస్తే వచ్చేవారం ఎలిమినేషన్ కి నామినేషన్ నుండి తప్పించుకోవచ్చని బిగ్ బాస్ చెప్పారు. ఈ క్రమంలో వారు సీక్రెట్ రూమ్ కి వెళ్లడం, వారి కోసం హౌస్ మేట్స్ కొన్ని త్యాగాలు చేయడం జరిగాయి.

శుక్రవారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను లివింగ్ రూమ్ లోకి రావాలని చెప్పి వారిని టీవీ ముందు కూర్చోమన్నారు. టీవీలో అలీ, పునర్నవి దర్శనమిచ్చారు. ఇంటి సభ్యులు తమను టీవీలో చూస్తున్నారని అలీ, పునర్నవిలకి తెలియదు. ఈ సమయంలో అలీ, పునర్నవిలకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ రూంలో చెట్టుకు ఒక డార్ట్ బోర్డు ఉంది.

ఆ బోర్డుపై అలీ, పునర్నవి తప్ప మిగిలిన కంటెస్టెంట్ల ఫొటోలు ఉన్నాయి. వీళ్లలో తమకు నచ్చని ఐదుగురుని ఎంపిక చేసి, దానికి గల కారణం కూడా చెప్పాలని అలీ, పునర్నవికి బిగ్ బాస్ సూచించారు. ఈ క్రమంలో వారు హౌస్ మేట్స్ పేర్లు చెబుతుంటే కంటెస్టంట్లు రకరకాల హావభావాలను ప్రదర్శించారు.ఇక అలీ, పునర్నవిలు సీక్రెట్ టాస్క్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారని వాళ్లు వచ్చేవారం నామినేషన్స్ ఉండరని బిగ్ బాస్ చెప్పారు.

ఇది ఇలా ఉండగా.. హౌస్ తొలి కెప్టెన్ గా వరుణ్ సందేశ్ తన బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని బిగ్ బాస్ అన్నారు. హౌస్ ఎవరు రూల్స్ పాటించకపోయినా పట్టించుకోవాల్సిన కెప్టెన్ పట్టించుకోలేదని..  దీనికి శిక్షగా వరుణ్ సందేశ్‌ను సర్వర్‌గా మార్చారు. ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్లినా, లోపలికి వచ్చినా వరుణ్ డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని ఆదేశించారు. అలాగే ఆహారం కూడా ఇంటి సభ్యులకు వరుణ్ సందేశ్ అందించాల్సి ఉంటుందని చెప్పారు.