బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో టెలిఫోన్ బూత్‌ ని ఏర్పాటు చేసి కంటెస్టంట్స్ తో మాట్లాడారు బిగ్ బాస్. మొదటిగా ఫోన్ రింగ్ అయినప్పుడు శ్రీముఖి వెళ్లి ఆవేశంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. అయితే ఆమె మొదటిగా ఫోన్ లిఫ్ట్ చేయడం వల్ల డైరెక్ట్‌గా నామినేట్ అయ్యిందని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.

ఆమె ఈ నామినేషన్ నుండి బయట పడాలంటే బాబా భాస్కర్‌ గెడ్డాన్ని క్లీన్ షేవ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. ఆ విషయాన్ని బాబా భాస్కర్ కి చెప్పింది శ్రీముఖి. ఆయన ఓకే చెప్పి క్లీన్ షేవ్ చేసుకొని శ్రీముఖిని నామినేషన్స్ నుండి బయటపడేశారు. ఇక పునర్నవి కోసం రాహుల్ పెద్ద త్యాగమే చేశారు. 20 గ్లాసుల కాకరకాయ రసం తాగితే పునర్నవి ఈవారం నామినేషన్ నుండి సేవ్ అవుతుందని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు.

దానికి రాహుల్ అంగీకరించి.. మధ్యలో వాంతులు అవుతున్నా.. పునర్నవి కోసం టాస్క్ ని పూర్తి చేశాడు. తన కోసం త్యాగం చేసిన రాహుల్ ని దగ్గరకు తీసుకొని గట్టిగా ముద్దుపెట్టుకుంది పునర్నవి. తన కౌగిలిలో రాహుల్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాహుల్ కోసం చేతిపై బిగ్ బాస్ ఐ టాటూ వేయించుకుంది శ్రీముఖి. ఇక శివజ్యోతి కోసం మహేష్ తన జుట్టుకి రంగువేసుకోగా.. బాబా భాస్కర్ కోసం తన షూస్ మొత్తాన్ని ఎరుపు రంగు డబ్బాలో ముంచి త్యాగం చేశాడు రవి.

ఇక హిమజ కోసం వరుణ్ పెద్ద త్యాగమే చేశాడు. పేడ ఉన్న టబ్ లో వరుణ్ పడుకుంటేనే హిమజ సేవ్ అవుతుందని చెబితే వరుణ్ అంత పనీ చేశాడు. తనకు వాంతులు వస్తున్నా.. భరించి టాస్క్ పూర్తి చేసి హిమజని సేవ్ చేశాడు.