ఆదివారం నాటి ఎపిసోడ్ లో అలీ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో వారంతా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా శివజ్యోతి ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు సోమవారం ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అయింది. ఆమెతో పాటు రవి కూడా కూర్చొని బాధ పడ్డాడు.

ఇంతలో వారిద్దరి దగ్గరకి వచ్చిన శ్రీముఖి... ''ఆపండెహే ఇది సంతాప సభ కాదు.. ఆడు చచ్చిపోలేదు. ఏడుస్తూ కూర్చోడానికి రెండు పీకుతా మిమ్మల్ని ఇద్దర్నీ.. మామూలుగా కొట్టను'' అని అరవడంతో ఇద్దరూ కంట్రోల్ అయ్యారు. అలీ రజా ఎలిమినేట్ కావడానికి కారణమైన బాబా భాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ని మొదలుపెట్టారు బిగ్ బాస్.

ఈవారం ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న పదకొండు మందిని రెండు గ్రూపులుగా విడగొట్టారు. కెప్టెన్ బాబా భాస్కర్ కి ఎలిమినేషన్ నుండి మినహాయింపు దక్కింది. గ్రూప్ 1లో రాహుల్, వరుణ్, వితికా, శిల్ప, పునర్నవిలు ఉండగా.. గ్రూప్‌ 2లో రవి, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, హిమజలు ఉన్నారు. ఒక్కో గ్రూప్‌ వాళ్లు.. తమ ఆపోజిట్ గ్రూప్‌లో ఉన్న ఇద్దరి ఫొటోలను తీసుకుని మంటల్లో కాల్చి నామినేట్ చేయడానికి సరైన కారణం చెప్పాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

ఈ ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఎక్కువ మంది శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖిలనునామినేట్ చేయడంతో ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ బిగ్ బాస్ కెప్టెన్ బాబా భాస్కర్ కి ఇవ్వగా.. ఆయన రవిని సేవ్ చేశారు.