బిగ్ బాస్ 2 తొలి ఎలిమినేటర్ సంజన... బిగ్ బాస్ లో వ్యవహారాలపై ఆమె ఏది మాట్లాడినా కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమె వికలాంగులకు వ్యతిరేకంగా ఓ మాట అన్నట్లు దుమారం చెలరేగింది. 

ఆ దుమారం తనకు మనస్తాపం కలిగించిందని ఆమె అన్నారు. ఏసియానెట్ న్యూస్ తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. దాదాపు అరగంట సేపు ఆమె వివిధ విషయాలపై మాట్లాడారు. వికలాంగులకు ఆమె సారీ చెప్పారు కూడా. 

తనకు వికలాంగుల పట్ల ఏ విధమైన గౌరవం ఉందనే విషయం చెబుతూ తన ఫ్రెండ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు.