'బిగ్ బాస్' నెక్స్ట్ సీజన్ కి రెడీ అవ్వండి!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 5, Sep 2018, 2:13 PM IST
Bigg Boss 12 launch in Goa
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 ఇంకా పూర్తికాక ముందే కొత్త సీజన్ ఏంటి అనుకుంటున్నారా..? కొత్త సీజనే కానీ ఇది తెలుగులో కాదు. బాలీవుడ్ లో ఇప్పటికే బిగ్ బాస్ షో 11 సీజన్లను పూర్తి చేసుకుంది. 

బిగ్ బాస్ సీజన్ 2 ఇంకా పూర్తికాక ముందే కొత్త సీజన్ ఏంటి అనుకుంటున్నారా..? కొత్త సీజనే కానీ ఇది తెలుగులో కాదు. బాలీవుడ్ లో ఇప్పటికే బిగ్ బాస్ షో 11 సీజన్లను పూర్తి చేసుకుంది.

ఇప్పుడు బిగ్ బాస్ షో 12వ సీజన్ లోకి ఎంటర్ కానుంది. తాజాగా ఈ సినిమా లాంఛింగ్ వేడుక గోవాలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ షో ఎలా వుండబోతుందనే విషయాన్ని తన మాటల్లో ప్రేక్షకులకు చెప్పాడు సల్మాన్. ఈ షోలో కంటెస్టెంట్స్ జంటలుగా కనిపించనున్నారు. షో థీమ్ విచిత్ర జోడీస్ అని సల్మాన్ తెలిపారు.

సాధారణంగా బాలీవుడ్ లో బిగ్ బాస్ షోని అక్టోబర్ నుండి ప్రసారం చేయడం మొదలుపెడతారు. కానీ ఈసారి సెప్టెంబర్ నుండే మొదలుపెట్టనున్నారు. సెప్టెంబర్ 16 నుండి ఈ షో టెలికాస్ట్ కానుంది.  

loader