ఈ ఏడాదిలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. జనసేన పార్టీలో చేరి వైజాగ్ లో ఓ నియోజకవర్గం తరఫున పోటీ చేయాలని అనుకున్నాడు.

ఆ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ షో కారణంగా ఆయనకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తరువాత మళ్లీ రీఎంట్రీలో వెళ్లి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో నూతన్ నాయుడు పేరు మాత్రం జనాలకు చేరువైంది.

ఇప్పుడు నూతన్ కి వెండితెరపై తన టాలెంట్ చూపించుకునే అవకాశం వచ్చింది. దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందిస్తోన్న 'F2'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమాలోనూతన్ నాయుడు కీలక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. 

ఇప్పటికే తన పాత్రకి సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తయిందని సమాచారం. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా హిట్ అయితే గనుక నూతన్ కి మంచి బ్రేక్ రావడం ఖాయం.