బిగ్ బాస్ సీజన్ 2 మొదలైన రెండు వారాలకే అందులో ఓ ప్రేమ జంట తయారైంది. వారు మరెవరో కాదు సామ్రాట్, తేజస్వి. మొదట్లో వీరిద్దరూ స్నేహితుల్లా ప్రవర్తించినా రానురాను ప్రేమికులకు మించిపోయినట్లు ప్రవర్తించారు.

ఒకరితో మరొకరు ఎంతో ప్రేమను చూపించడం, సన్నిహితంగా మెలగడం ఇలా హౌస్ లో చాలా రొమాన్స్ జరిగింది. అయితే షో మధ్యలో ఫోన్ కాల్ టాస్క్ లో సామ్రాట్ తల్లి తేజస్వి విజయంలో వార్న్ చేసింది. ఎలాంటి ట్యాగ్స్ తగిలించుకోకు అంటూ పరోక్షంగా తేజస్వి ప్రస్తావన తీసుకొచ్చింది. 

షో నుండి బయటకి వచ్చేసిన తరువాత కూడా ఈ జంట ఎక్కడా సన్నిహితంగా కనిపించలేదు. ఎట్టకేలకు వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటో ఆన్ లైన్ పెట్టింది తేజస్వి. దీపావళి సందర్భంగా తేజస్వి తన ఇంట్లో చిన్న పార్టీని ఎరేంజ్ చేసింది.

దీనికి సామ్రాట్, తనీష్, దీప్తి సునైనాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజస్వి.. సామ్రాట్, తనీష్ లతో తీసుకున్న ఫోటోని పోస్ట్ చేస్తూ.. 'మై బాయ్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My boys @samratreddy @tanishalladi

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on Nov 7, 2018 at 8:58am PST

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hate them or love them friends forever.

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on Nov 7, 2018 at 7:07am PST