Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌, అశ్విని బ్రెయిన్‌లెస్‌, భోలే ఎయిమ్‌ లెస్‌.. ఆ ముగ్గురి రీఎంట్రీలో మరో ట్విస్ట్

బిగ్‌ బాస్‌ తెలుగు 7 శనివారం ఎపిసోడ్‌లో ఆశ్చర్యకరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. హౌజ్‌లో ఉన్న వారిలో బ్రెయిన్‌ లెస్‌ ఎవరు, ఎయిమ్‌లెస్‌ ఎవరు అనేది తేలిపోయింది.

big twist in rathika subha shree damini re entry and amardeep ashwini brainless bhole aimless in bigg boss 7 arj

బిగ్‌ బాస్‌ తెలుగు 7 శనివారం ఎపిసోడ్‌లో ఆశ్చర్యకరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. హౌజ్‌లో ఉన్న వారిలో బ్రెయిన్‌ లెస్‌ ఎవరు, ఎయిమ్‌లెస్‌ ఎవరు అనేది తేలిపోయింది. మరోవైపు హౌజ్‌లోకి ముగ్గురు ఎలిమినేట్‌ కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇచ్చారు. దీంతో  ఆ ముగ్గురు మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అంతా భావించారు. కానీ అందులో పెద్ద ట్విస్ట్ పెట్టాడు నాగార్జున. ఇలాంటి ఆసక్తికర సంఘటనలు శనివారం ఎపిసోడ్‌లో చోటు చేసుకున్నాయి. 

ఇక కిచెన్‌లో డిస్కషన్‌తో ఈ రోజు ఎపిసోడ్‌ ప్రారంభమైంది. అనంతరం హౌజ్‌లో కంటెస్టెంట్లు చేసిన తప్పులను నాగ్‌ ప్రశ్నించారు. బ్రెయిన్‌ వాష్‌ చేశారు. అలాగే కొత్తగా ఎన్నికైన కెప్టెన్‌ని అభినందిస్తూ ఆయన యాటిట్యూడ్‌ని నిలదీశాడు. డిక్టేటర్‌లా వ్యవరించకూడదని, అందరి మనసులు గెలుచుకోవాలని తెలిపారు నాగ్‌. ఈ సందర్భంగా అమర్‌ దీప్‌తో గొడవ, సందీప్‌ మధ్యలో వచ్చిన సందర్బాన్ని ప్రస్తావిస్తూ సందీప్‌కి క్లాస్‌ పీకాడు. అయితే అమర్‌ దీప్‌ ఆట మెరుగుపడిందని, ఇలానే ఆడాలని తెలిపారు. 

అనంతరం హౌజ్‌లో బ్రెయిన్‌ లెస్‌, ఎయిమ్‌ లెస్‌, యూజ్‌లెస్‌ ఎవరో చెప్పాలని నాగ్‌ ఒక టాస్క్ ఇచ్చారు. ఇందులో భోలేకి మూడు ఎయిమ్‌ లెస్‌, ఒక బ్రెయిన్‌ లెస్‌ ట్యాగ్‌ వచ్చింది. అత్యధిక ట్యాగ్స్ ఆయనకు పడ్డాయి. ఆ తర్వాత అశ్విని, అమర్‌ దీప్‌లకు బ్రెయిన్‌ లెస్‌ ట్యాగ్‌లు పడ్డాయి. ఇలా అమర్‌ దీప్‌, అశ్విని బ్రెయిన్‌ లెస్‌గా, భోలే ఎయిమ్‌ లెస్‌గా నిలిచారు. దీన్నుంచి బయటపడాలని, ఆట మెరుగు పర్చుకోవాలని నాగార్జున తెలిపారు. 

అనంతరం హౌజ్‌ అందరికి సర్‌ప్రైజ్‌తో కూడిన ట్విస్ట్ ఇచ్చారు. హౌజ్‌ నుంచి వరుసగా ఎలిమినేట్‌ అయిన ముగ్గురు కంటెస్టెంట్లని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చారు. వారికి మళ్లీ నిరూపించుకునే సెకండ్‌ ఛాన్స్ ఇచ్చారు బిగ్‌ బాస్‌. అయితే అక్కడే ట్విస్ట్ పెట్టారు. ఈ ముగ్గురు హౌజ్‌లోకి వెళ్లి తమకు ఓట్‌ చేయాలని, తాము ఎందుకు మళ్లీ హౌజ్‌లోకి రావాలో తెలియజేసి క్యాంపెయిన్‌ చేసుకోవాలని తెలిపారు. కంటెస్టెంట్లని మనసుని దోచుకుని తమకి ఎక్కువగా ఓట్లు పడేలా ప్రచారం చేసుకోవాలని, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ ఒక్కరికి మాత్రమే హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. 

ఇలా దామిని తాను చేసిన మిస్టేక్‌ చెప్పింది. సరిగా ఆట ఆడలేదని తెలుసుకున్నట్టు తెలిపింది. వంద శాతం తన ఆట ఆడలేదని, ఇకపై ఆడతానని, తన బెస్ట్ ఇస్తానని తెలిపింది. యావర్‌పై పేద కొట్టడం టాస్క్ లో భాగమే అని, పర్సనల్‌గా తనకేం లేదని, మళ్లీ ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటానని, ఎంటర్‌టైన్‌ చేస్తానని, మీ మ్యూజిక్‌ సిస్టమ్‌ నేనే అని పేర్కొంది. రతిక చెబుతూ తాను నిజాయితీగా గేమ్‌ ఆడతానని, ఫిజికల్‌గా, మెంటల్‌గా తాను స్ట్రాంగ్‌ అని నిరూపించుకుంటానని చెప్పింది. ఒక్క అవకాశం ఇవ్వాలని తెలిపింది. తాను థ్రిల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా అన్ని అందిస్తానని, ప్రతి విషయంలో బెస్ట్ ఇచ్చానని, కానీ అనుకోకుండా ఎలిమినేట్‌ అయ్యానని తెలిపింది శుభ శ్రీ. తన కెపాసిటీ ఏంటో నిరూపించుకోవడానికి మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పింది శుభ శ్రీ.మరి ఓటింగ్‌ చేసే అవకాశం రేపు ఇవ్వబోతున్నారు నాగ్‌. దీంతో మళ్లీ హౌజ్‌లోకి వచ్చేది ఎవరనేది రేపు ఆదివారం ఎపిసోడ్‌లో తేలనుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios