బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) అప్ కమింగ్ ఫిల్మ్ ‘టైగర్ 3’. ఈ మూవీ కోసం సల్లూబాయ్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ తాజాగా టీజర్ వదిలారు.
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘టైగర్ 3’ మూవీలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ (Katrina Kaif) మరోసారి భారీ యాక్షన్ సీన్లకు చూపించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 చిత్రం నుంచి తాజాగా మేకర్స్ మొదటి టీజర్‌ను విడుదల చేశారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఈ టీజర్ ను వదిలారు. ఈ మేరకు టీజర్ ను స్మలాన్ ఖాన్ తన ట్విట్టర్ లో పంచుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 21న ఈద్ సందర్భంగా ఈ మూవీని విడుదల చేయనున్నట్టు తెలిపారు. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో నిర్మిస్తున్న 50వ చిత్రం ‘టైగర్ 3’(Tiger 3 Movie) కి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు మనీష్ శర్మ ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నారు. ఎక్తా టైగర్, టైగర్ జిందా హే మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన టీజర్ ఆసక్తి కరంగా ఉంది. నలుపు కలర్ షర్ట్ అండ్ ప్యాంట్‌లో ఉన్న కత్రినా కైఫ్‌తో కొన్ని ఫైట్ సీన్స్ ను చేస్తూ ఉండగా టీజర్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఆమెకు మరికొన్ని స్టంట్లను తెలియజేసేందుకు కొరియోగ్రాఫర్‌లు సూచనలు చేస్తూ ఉంటారు. చివర్లో కత్రినా పడుకున్న సల్మాన్ ఖాన్ లేపి తన ప్రాక్టీస్ ను ప్రారంభించమంటోంది. ఇందుకు సల్మాన్ స్పందిస్తూ.. ‘టైగర్.. ఎల్లప్పుడూ సిద్ధమే’ అంటూ బదులిస్తాడు. కాగా నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ లింకును సల్మాన్ ఖాన్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఇలా రాశాడు. ‘మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. 2023 ఈద్‌లో టైగర్3 మూవీని హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం. 21 ఏప్రిల్ 2023న మీకు దగ్గర్లోని థియేటర్లలో మాత్రమే టైగర్ 3 సినిమాను చూడండి’ అంటూ పేర్కొన్నాడు.
మరోవైపు టైగర్ 3 మూవీలతో పాటు.. షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’ మూవీలోనూ సల్లూ బాయి కనిపించనున్నట్టు తెలుస్తోంది. అలాగే తెలుగులో మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీలోనూ సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. అలాగే ‘కబీ ఈద్ కబీ దివాలీ’ చిత్రంలోనూ నటిస్తున్నారు బాయిజాన్. ఏదేమైనా ఈ ఏడాది వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు మూడు నాలుగు సినిమాల్లో కనిపించి.. ఫ్యాన్స్ ను ఖుషీ చేయనున్నారు.
