బ్లాక్ బస్టర్ ప్రచారం అంతా మిథ్య అని తేలిపోయింది. వాస్తవంలో గాడ్ ఫాదర్ చిరంజీవి కెరీర్ లో మరో డిజాస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. సోమవారం భారీగా వసూళ్లు పతనమయ్యాయి.  


మండే టెస్ట్ లో గాడ్ ఫాదర్ ఫెయిల్ అయ్యింది. దాదాపు 70 శాతం వసూళ్లు పతనమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గాడ్ ఫాదర్ చిత్రానికి ఎక్స్ట్రా థియేటర్స్ యాడ్ చేస్తున్నారు, సినిమా బ్లాక్ బస్టర్ అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. గాడ్ ఫాదర్ సినిమాను దసరా సెలవులు కూడా కాపాడలేకయాయి. లాగ్ వీకెండ్ తో పాటు పండగ సీజన్ కలిసొచ్చినా బయ్యర్లు సేవ్ కాలేకపోయారు. 

ఆదివారం వరకు స్థిరంగా ఉన్న వసూళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఓపెనింగ్ డే భారీ వసూళ్లు రాకపోవడం కూడా ఒక కారణమైంది. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 13 కోట్ల షేర్ మాత్రమే గాడ్ ఫాదర్ రాబట్టింది. ఇది చిరంజీవి గత మూడు చిత్రాలు ఖైదీ నంబర్ 150, సైరా, ఆచార్య కంటే తక్కువ కావడం విశేషం. రెండు, మూడు, నాలుగో రోజు వరకు గాడ్ ఫాదర్ వసూళ్లు బాగున్నాయి. పెద్దగా డ్రాప్ కనిపించలేదు. సోమవారం మాత్రం దెబ్బేసింది. 

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం గాడ్ ఫాదర్ 6వ రోజు ఏపీ/తెలంగాణాలలో రూ.1.4 షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ రూ. 70 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ రూ. 85 నుండి 90 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక ఆరు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ.37 కోట్లు, వరల్డ్ వైడ్ రూ. 48 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే 50 శాతానికి కొంచెం అటూ ఇటూగా రికవరీ చేసింది. 

సోమవారం ట్రెండ్ కొనసాగితే గాడ్ ఫాదర్ చిరంజీవికి మరో డిజాస్టర్ అవుతుంది. మిరాకిల్ జరిగితే తప్ప ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. గాడ్ ఫాదర్ సైతం భారీ నష్టాలు మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కింది. నయనతార, సత్యదేవ్ కీలక రోల్స్ చేశారు. మోహన్ రాజా దర్శకుడు. తమన్ సంగీతం అందించారు.