నేచురల్‌ స్టార్‌ నాని సాహసం చేయబోతున్నాడు. నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన `టక్‌ జగదీష్‌`లో రాయలసీమ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. మరోవైపు `శ్యామ్‌సింగరాయ్‌`లో ఓ పీరియాడికల్‌ స్టోరీని, హిస్లారికల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఓ డిఫరెంట్‌ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా సరికొత్తగా ఉంటుందని విడుదలైన ఫస్ట్ లుక్‌ని చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కోల్‌కత్తాని సృష్టించబోతున్నారు. హిస్టారికల్‌ నగరమైన కోల్‌కత్తాని హైదరాబాద్ కి తీసుకురాబోతున్నారు. 

`టాక్సీవాలా` వంటి డిఫరెంట్‌ సినిమాని రూపొందించిన రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కోల్‌కత్తా సెట్‌లోని హైదరాబాద్‌లో వేయబోతున్నారు. దాదాపు 6.5కోట్లతో భారీగా సెట్‌ వేయబోతుండటం విశేషం. దీన్నొక విజువల్‌ ఫీస్ట్ గా డిజైన్‌ చేయబోతున్నారట. `ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల..కోల్‌కతాను త‌ల‌పించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో రీ క్రియేట్‌ చేశారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్‌తో ప‌ది ఎక‌రాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. హీరో నాని స‌హా ముఖ్యతారాగణంపై ప‌లు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  థియేట‌ర్‌ల‌లో ఈ స‌న్నివేశాలు సినీ ప్రియుల‌కి ఒక  కొత్త అనుభూతిని పంచ‌నున్నాయ‌`ని చిత్ర యూనిట్ తెలిపింది. 

`ద‌ర్శ‌కుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ ఓ యూనిక్‌ కాన్సెప్ట్‌తో  ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో తన గ‌త చిత్రాల‌కు భిన్న‌మైన స‌రికొత్త గెట‌ప్స్‌ల‌లో నేచుర‌ల్ స్టార్ నాని క‌నిపించ‌నున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో  అసోసియేట్‌ అయిన ప్ర‌తి ఒక్క‌రికీ  సినిమా ఓ స్పెషల్‌ ఫిల్మ్‌గా ఉండబోతుంది. జీస్సూసేన్‌ గుప్తా, రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా  ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ నవీన్‌ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు` అని యూనిట్‌ చెప్పింది.