సౌత్ ఇండస్ట్రీలో ఎంత మంది కొత్త హీరోయిన్స్ ఎన్ని బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నా కూడా నయన్ స్థాయిలో అవకాశాలు అందుకోలేరనే చెప్పాలి. వరుసగా అవకాశాలు అందుకుంటున్న ఈ హాట్ బ్యూటీ జయాపజయాలతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకుంది. 

ఇక బేబీ ఎంత పెద్ద సినిమా చేసినా ప్రమోషన్స్ లో పాల్గొనదని అందరికి తెలిసినా విషయమే. ఆ విధంగా అవకాశాలు పోగొట్టుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. పర్సనల్ లైఫ్ పై మీడియా ఎక్కడ ప్రశ్నలు వేస్తుందో అని నయన్ ప్రమోషన్స్ కు దూరంగానే ఉంటుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే సైరా సినిమాకు సైన్ చేసినప్పుడు నయన్ ప్రమోషన్ లో పాల్గొంటానని చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది. 

అయితే ఫైనల్ బేబీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి షూటింగ్స్ లో బిజీగా ఉన్నానంటూ తప్పించుకుందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఆమె ఉండాల్సిన ప్లేస్ లో తమన్నా కనిపిస్తూ తన క్రేజ్ ను కూడా పెంచుకుంటోంది. ఆమె సినిమాలో నటించింది జస్ట్ గెస్ట్ రోల్ అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ కోసం పిలవగానే వెళుతోంది. కానీ నయన్ సినిమాలో కథానాయిక పాత్ర. తప్పకుండా ప్రెస్ మీట్ లో ఉండాల్సిన బేబీ చివరికి చేతులెత్తేసినట్లు టాక్.