బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి వస్తోన్న బారి బడ్జెట్ చిత్రం సాహో. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ సినిమాల కంటే హై రేంజ్ లో యాక్షన్ సీన్స్ తో ఎట్రాక్ట్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన కొన్ని విషయాలు అభిమానుల్లో అంచనాల డోస్ ని పెంచేస్తున్నాయి. 

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దర్శకుడు సుజిత్ మొదటి సినిమా రన్ రాజా రన్ సినిమాను లార్జ్ స్కెల్ తో హై విజువల్స్ తో చూస్తే సాహో లా ఉంటుందట. ఓ విధంగా దర్శకుడు ఈ సినిమాలో ఆ సినిమాకు సంబందించిన కీ పాయింట్ నే వాడినట్లు తెలుస్తోంది. తండ్రి పగ కోసం చివరి వరకు ఎవరికీ తెలియకుండా ఎలా పోరాడాడు అనేది సినిమా లో అసలైన పాయింట్ అని టాక్ వస్తోంది. ఆ ఫ్లోలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మూడ్ ని చేంజ్ చేస్తాయని తెలుస్తోంది. 

ఛేజింగ్ సీన్స్ తో పాటు అతి భయంకరమైన కరేబియన్ స్మగ్లర్స్ తో పోరాడటం అంతే కాకుండా ప్రతి సీన్ రిచ్ అండ్ స్టయిలిష్ గా కనిపించడం వంటి మూమెంట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళతాయట. దర్శకుడు సుజీత్ ఎక్కడా తడబడకుండా తీసుకున్న జాగ్రత్తలు ఆడియెన్స్ ఊహలను హాలీవుడ్ స్థాయికి తీసుకెళతాయట. మరి ఇంతలా ఉరిస్తోన్న సాహో వెండితెరపై ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.