సారాంశం

కమల్‌ హాసన్‌ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా తాను నటిస్తున్న సినిమాల అప్‌డేట్లు ఇస్తున్నారు. కానీ `కల్కీ` టీమ్‌మాత్రం డిజప్పాయిం్ చేసింది.

లోకనాయకుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan).. ఇండియన్‌ సినిమాలో ఆయనది చెరగని ముద్ర. ఆయన కేవలం తమిళంకి మాత్రమే పరిమితం కాదు, పాన్‌ ఇండియా అనే ట్రెండ్‌ స్టార్ట్ చేసిందే ఆయన, హీరోగా, ఆయన సినిమాలతో ఎప్పుడో పాన్‌ ఇండియా ట్రెండ్‌ని తెరపైకి తెచ్చారు. కానీ ఇప్పుడు `పాన్‌ ఇండియా` అనే పదాన్ని వాడుతున్నారు. ఆర్ట్ ని, కమర్షియాలిటీని మేళవించి సినిమాలు చేసి సక్సెస్‌ అయిన ఏకైకా హీరో కమల్‌ హాసన్‌. ఈ విషయంలో ఇండియన్‌ సినిమాకి ఆయనొక ఆదర్శం. ఒక గౌరవం.

ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక చాలా మంది మేకర్స్ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ప్రయోగం అనేది ఆయన్నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమా లెజెండ్‌, సినిమా వీకిపీడియాలాంటి వారు కమల్‌. ఆయన బర్త్ డే అంటే ఆయన నటించే చిత్రాల నుంచి కనీసం ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ లాంటివి విడుదల చేయాలి. అది ఆయనకిచ్చే రెస్పెక్ట్. కానీ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `కల్కీ2898ఏడీ`(Kalki2898AD) టీమ్‌ ఓ రకంగా అవమాన పరిచిందనే చెప్పొచ్చు. 

నేడు కమల్‌ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్న `కల్కీ2898ఏడీ` చిత్రం నుంచి విశ్వనటుడి ఫస్ట్ లుక్‌ ఎక్స్ పెక్ట్ చేశారు ఫ్యాన్స్. టీమ్‌ కూడా ఫస్ట్ లుక్‌ లాంటివి విడుదల చేస్తాయని, ఈ చిత్రం నుంచి అప్‌డేట్‌ కూడా ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే, జస్ట్ విషెస్‌తో సరిపెట్టారు. కమల్‌ పాత ఫోటోని  `కల్కి2898ఏడీ` పోస్టర్‌లో కలిపి రిలీజ్‌ చేస్తూ ఆయనకు పుట్టిన రోజు విషెస్‌ తెలిపారు. 

దీంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఒక లెజెండ్‌ యాక్టర్‌కి ఇది ముష్టి వేసినట్టు ఉందని, ఏంట్రా ఇది, హీరో పుట్టిన రోజు అప్‌ డేట్‌ కూడా ఇవ్వరా, కనీసం ఫస్ట్ లుక్‌ ఇవ్వలేకపోవడం బాధాకరం అని, మీమ్స్ , ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు. పుట్టిన రోజు కూడా అప్‌డేట్ ఇవ్వలేకపోవడం ఏంటి? అంటూ మండిపడుతున్నారు. సదరు ప్రొడక్షన్‌ కంపెనీని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `కల్కి2898ఏడీ`లో కమల్‌ హాసన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పడుకొనె, దిశా పటానీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు నాగ్‌ అశ్విన్‌. రెండు భాగాలుగా దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారు.