Asianet News TeluguAsianet News Telugu

తమ మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో తేల్చుకోలేకపోతున్న శ్రీరామ్‌, హమీద.. షణ్ముఖ్‌పై సిరి ఆరోపణలు..

బిగ్‌బాస్‌5(biggboss5) హౌజ్‌లో వరస్ట్ పర్‌ఫర్మెర్‌ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్‌ తెలిపారు. మేజర్‌గా మానస్‌(manas)కి ఓట్లు రావడం, ఆయన కూడా తనే వరస్ట్ పర్‌ఫెర్మర్‌ అని చెప్పుకోవడంతో ఆయన్ని వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా నిర్ణయించారు. జైల్లో పెట్టారు. 

big conflict run between sreeram hamida and siri shanmukh in biggboss5 house
Author
Hyderabad, First Published Sep 25, 2021, 7:00 AM IST

బిగ్‌బాస్‌5 20వ(శుక్రవారం) ఎపిసోడ్‌ మిక్స్ డ్‌గా సాగింది. ఈ వారం వరస్ట్ పర్‌ఫెర్మర్‌, కెప్టెన్‌ ఫనిష్‌మెంట్‌ తీసుకోవడం, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ జరిగాయి. నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు తన ఫస్ట్ లవ్ గురించి వెల్లడించి సర్‌ప్రైజ్‌ చేశారు. నేటి ఎపిసోడ్‌లో మిగిలిన వారి గురించి టెలికాస్ట్ చేయలేదు బిగ్‌బాస్‌. హౌజ్‌లో వరస్ట్ పర్‌ఫర్మెర్‌ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్‌ తెలిపారు. మేజర్‌గా మానస్‌కి ఓట్లు రావడం, ఆయన కూడా తనే వరస్ట్ పర్‌ఫెర్మర్‌ అని చెప్పుకోవడంతో ఆయన్ని వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా నిర్ణయించారు. జైల్లో పెట్టారు. 

అయితే అంతకు ముందు హమీదకి మూడు పూటలు ఫుడ్‌ తినిపిస్తున్నాడు మానస్‌. ఇప్పుడు జైల్లో ఉండటంతో హమీదకి ఎవరు తినిపిస్తారంటూ ప్రియాంక కామెంట్లు చేయడం హైలైట్‌గా నిలిస్తే, ఈ విషయంలో హమీద కాస్త ఫీల్‌ అయ్యింది. అదే సమయంలో మానస్‌ వద్దే ఉంటూ ఆయనతో ప్రేమ పాఠాలు నడించింది ప్రియాంక. ఎవరికైనా రాఖీ కడతాను,కానీ నీకు మాత్రం కట్టను అని తెలిపింది. ఇక రవి, ప్రియాంక, లోబోల మధ్య సరదా కన్వర్జేషన్‌ మధ్యలో ప్రియాంకా.. `పారిస్‌` అని పాష్‌గా చెప్పడం, లోబో బాంబ్‌ వేయడం నవ్వులు పూయించింది. 

మరోవైపు లోబో బిగ్‌బాస్‌ని రిక్వెస్ట్ చేసుకుని సీట్స్ వెనకాల కాసేపు నిద్రపోయాడు. దీంతో ఆలారం మోగింది. కానీ తాను నిద్ర పోలేదని కెప్టెన్‌ జెస్సీతో అబద్దం చెప్పాడు లోబో. ఇలా హౌజ్‌లో ఐదు మిస్టేక్స్ అయ్యాయని అందుకు తానే ఫనిష్‌మెంట్‌ తీసుకుంటున్నానని, ఐదు గుంజీలు తీశాడు జెస్సీ. దీనిపై ఇతర సభ్యులు వ్యతిరేకిస్తూ, కెప్టెన్‌ అనేవాడు ఫనిష్‌మెంట్లు వేయాలని, ఆదేశించాలని తెలిపారు. 

మరోవైపు షణ్ముఖ్‌ విషయంలో సిరి పలు ఆరోపణలు చేసింది. అతను తనతో క్లోజ్‌గా ఉండటం లేదని, తనని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపింది. తనతో హార్ట్ తో మాట్లాడటం లేదని, నటిస్తున్నాడని, ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాలేదని వాపోయింది సిరి. ఇక శ్రీరామ్‌, హమీదల మధ్య లవ్‌ స్టోరి మరోసారి తెరపైకి వచ్చింది. రాత్రి లేట్‌ నైట్‌లో వీరిద్దరి తమ రిలేషన్‌ గురించి చర్చించుకున్నారు. మానస్‌ అన్నం తినిపించడాన్ని శ్రీరామ్‌ ప్రశ్నించారు.

అయితే మానస్‌, సన్నీ తనకు ఫ్రెండ్స్ అని, వాళ్లు హెల్ప్ చేసినప్పుడు తాను కూడా ఏదైనా హెల్ప్‌ చేయాలి కదా అని తెలిపింది. ఈ సందర్భంగా తమ మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటనేది ప్రశ్నించాడు శ్రీరామ్‌. ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు అని, కాకపోతే అదేంటనేది క్లారిటీ లేదని తెలిపారు. ఈ లేట్‌ డిస్కషన్‌ ఇప్పుడు హౌజ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios