బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే. 16 మంది కంటెస్టంట్స్ తో ఈ షోని నిర్వహిస్తున్నారు. అయితే ఈ షో కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనే విషయాన్ని గోప్యంగానే ఉంచారు. కానీ సింగర్ గీతామాధురికి ఎంత పారితోషికం ఇవ్వబోతున్నారనే విషయం మాత్రం బయటకు లీక్ అయింది. హిందీ బిగ్ బాస్ లో అయితే టీవీ ఆర్టిస్ట్ కు కూడా రోజుకి రూ.5 లక్షల చొప్పున చెల్లించిన సందర్భాలు ఉన్నాయి.

కానీ తెలుగుకి వచ్చేసరికి రోజుకి రూ.20 వేలు తీసుకునే హౌస్ మేట్స్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో సింగర్ గీతామాధురికి మాత్రం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందిందట. ఆమె హౌస్ లో ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయం పక్కన పెడితే మొత్తగా రూ.20 లక్షల పారితోషికం అందుకుందట. ఆమె హౌస్ లో పది రోజులు ఉన్నా.. షో పూర్తయ్యే వరకు ఉన్నా.. ఆమె రెమ్యునరేషన్ మాత్రం ఫిక్స్ అంట.

గెలిస్తే ఎలాగో ఎక్కువ మొత్తంలో డబ్బు ముట్టజెప్పుతారు. అయినా డబ్బు కంటే 'బిగ్ బాస్' షో ద్వారా వచ్చే పాపులారిటీ మరింత ఎక్కువనే చెప్పాలి.