బిగ్ బాస్2: నాని గ్రాండ్ ఎంట్రీ

big boss2 first day episode updates
Highlights

బిగ్ బాస్ సీజన్2 షోను ఈరోజు(ఆదివారం) నుండి ప్రసారం చేస్తున్నారు నిర్వాహకులు

బిగ్ బాస్ సీజన్2 షోను ఈరోజు(ఆదివారం) నుండి ప్రసారం చేస్తున్నారు నిర్వాహకులు. ఈ షోలో నేచురల్ స్టార్ నాని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 'మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం' సాంగ్ తో నాని ఇచ్చిన ఎంట్రీ ఆకట్టుకుంది. రెండు, మూడు స్టెప్పులు వేసి.. తనదైన స్టైల్ లో పంచ్ లు వేయడం మొదలుపెట్టాడు. 

బిగ్ బాస్ సీజన్ 1 ను ఇప్పటివరకు చూడలేదని ఏ ముహూర్తాన అన్నానో రెండు రోజుల పాటు కూర్చోపెట్టి షో మొత్తాన్ని చూపించేశారని అన్నాడు. అందులో పాల్గొన్న పోటీదారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి హౌస్ ఎలా ఉందో ఆడియన్స్ కు చూపించారు. మొత్తం 16 మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనున్నారు. మొదటి పార్టిసిపెంట్ గా సింగర్ గీతామాధురి ఎంట్రీ ఇచ్చింది. 

ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లోకి గీతామాధురితో పాటు అమిత్ తివారి, యాంకర్ దీప్తి, బాబు గోగినేని, తనీష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ భాను శ్రీ, తెలంగాణా రాప్ సింగర్ రోల్ రైడా, యాంకర్ శ్యామల, నటుడు కిరీటి దామరాజు ఎంట్రీ ఇచ్చారు. 

loader