బిగ్ బాస్ సీజన్ 1 కి మంచి స్పందన రావడంతో సీజన్ 2ని కూడా మొదలుపెట్టారు నిర్వాహకులు. 16 మంది కంటెస్టంట్లతో మొదలైన ఈ షోలో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. 106 రోజుల పాటు సాగనున్న ఈ షోలో ప్రతి వారంలో ఒక్కో కంటెస్టంట్ ను ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారు. అయితే చివరి వరకు షోలో ఉండే విధంగా కొందరు పోటీదారులు మాత్రం హౌస్ లోకి వెళ్ళకముందే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

ఈ షోలో ఎలిమినేషన్ రౌండ్ ఓటింగ్ ద్వారా జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే కొందరు కంటెస్టంట్లు హౌస్ లోకి రాకముందే తమ కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్ ను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు పోటీదారులు ఈవిధమైన టీమ్ లను ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. హౌస్ లో ఉన్న వారిని ఈ టీమ్ ఎలిమినేషన్ రౌండ్ నుండి కాపాడటమే వారి ఉద్దేశం.

దీనికోసం కొంత డబ్బు ఇచ్చి అకౌంట్లను మైంటైన్ చేస్తున్నారు. ఈ లిస్టులో తేజస్వి, యాంకర్ దీప్తి, అలానే దీప్తి సునయన ఉన్నారని సమాచారం. టైటిల్ ను గెలవడానికి ముందే ప్లాన్ చేసుకొని మరి హౌస్ లోకి అడుగుపెట్టారు ఈ ముగ్గురు. టైటిల్ సంగతి తరువాత చివరి వరకు అయినా.. వీళ్లు హౌస్ లో కొనసాగుతారేమో చూడాలి!