Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌజ్ లో ఇవేమి ముద్దులురా బాబూ.

  • ఈ షోలో ముద్దుల పరంపర  కొనసాగుతోంది.
  • ప్రిన్స్.. సారీ చెప్పే నెపంతో దీక్షకు ముద్దు పెట్టాడు.  కాగా.. ఇప్పుడు వంతు ముమైత్ కి వచ్చింది.
  • ఇది చూసిన బిగ్ బాస్ హౌజ్ మేట్స్ అందరూ ఆశ్చర్యపోయారు.
Big Boss Show Mumaith Khan Kiss To Navdeep

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ రాను రాను బోల్డ్ గా మారుతోంది. ఇప్పటికే గ్లామర్ కోసం దీక్షాపంత్, నవదీప్ లాంటి వాళ్లను వైల్ట్ కార్డ్  ఎంట్రీతో హౌజ్ లోకి పంపించిన బిగ్ బాస్ వారం వారం హౌజ్ మేట్స్ కు కొత్త కొత్త టాస్క్ లు ఇస్తూ షోని రక్తి కట్టిస్తున్నారు. ఇక హౌజ్ మేట్స్ కూడా మేమేం తక్కువ తినలేదు అంటూ బాస్ చెప్పిన దానికంటే కాస్త ఎక్కువే చేసి చూపిస్తున్నారు. బిగ్ బాస్ షో.. మొదట్లో కాస్త బోర్ కొట్టినా.. రానురాను ఆసక్తి రేపుతోంది.

షోలో ఇటీవలే ప్రారంభమైన ముద్దుల పరంపర మరింత జోరందుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా  హౌజ్ లో అడుగుపెట్టిన దీక్ష.. ప్రిన్స్ పై సీరియస్ అయిన సందర్భంలో ప్రిన్స్.. సారీ చెప్పే నెపంతో ముద్దు పెట్టి మరీ క్షమాపణ చెప్పాడు. అప్పట్లో తెలుగు టీవీ రంగంలో సంచలనంగా మారిన ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.
ఇక ఇప్పుడు ముద్దుల పరంపరను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు బిగ్ బాస్ కంటెస్టంట్స్. ఈ సారి వంతు ముమైత్ కి వచ్చింది. ఇంట్లోని సభ్యులందరి ముఖాలకు ముమైత్ చిత్ర విచిత్రంగా  మేకప్ లు వేసింది. తన టాస్క్ లో భాగంగా దీక్ష, నవదీప్ లకు ముద్దులు పెట్టింది. ముమైత్ ముద్దులు ఎందుకు పెడుతుందో తెలియని బిగ్ బాస్ హౌజ్ మేట్స్ అంతా ఆశ్చర్యపోయారు. అయినా ఐటమ్ గర్ల్ గా తనకంటూ ఇమేజ్ వుంది కాబట్టి ఇదేదో ఐటమ్ యాంగిల్ అనుకుని, ముమైత్ కి ఇలాంటివి కామన్ అని సర్దుకున్నారు.

మరోవైపు బిగ్ బాస్ హరితేజ, శివ బాలాజీలను కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. అక్కడ వీరిద్దరికీ ఒక టాస్క్ అప్పగించారు. హరితేజ కోతిలా, ఆ కోతిని ఆడించేవాడిలా శివ బాలాజీ టాస్క్ ఫినిష్ చేయమన్నారు. ఆ కోతిని ఆడిపిస్తూ దానికి లాలీపాప్, అరటిపళ్లు, చాక్టెట్లు ఇవ్వొచ్చని సూచించారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ ను హౌజ్‌మేట్స్‌ కి చెప్పకుండా సరదాగా హరితేజ, శివ బాలాజీ చేసుకుంటూ పోయారు.
ఇక ఈ సారి ఎలిమినేషన్ కి నవదీప్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, అర్చన, దీక్ష నామినేట్ అయినట్లు బిగ్ బాస్ చెప్పారు. మరి గత వారం మిరపకాయ దండల్లో టాపర్ గా నిలిచిన అర్చన వెళ్తుందా లేక మరెవరైనా హౌజ్ విడిచి వెళ్తారా అనేది వీకెండ్ లోనే చూడాలి. మొత్తానికి ముద్దుల గోల మున్ముందు ఎటు దారితీస్తుందో ఏమో..

 

Follow Us:
Download App:
  • android
  • ios