బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా  బిగ్ బాస్ హౌస్ ని  బేబీ కేర్ సెంటర్ గా మార్చేశాడు. టీమ్ సభ్యులను..బేబీలుగా మరియు కేర్ టేకర్స్ గా మార్చేశాడు. అవినాష్ , ఆరియాన, మెహబూబ్, హారిక , అమ్మ రాజశేఖర్ లను బేబీలుగా, వారి చూసుకొనే కేర్ టేకర్స్ గా అభిజిత్, నోయల్, అఖిల్, మోనాల్, సోహైల్ లను నియమించాడు. లాస్యను ఈ టాస్క్ కి సంచాలకురాలిగా నియమించారు. 

పిల్లలు ఏడ్చిన ప్రతిసారి అన్నం పెట్టాలని, స్కూల్ బెల్ కొట్టినప్పుడు వారిని స్కూల్ కి తీసుకెళ్లాలని, వారికి పాఠాలు చెప్పడంతో పాటు ఎంటర్టైనర్ చేయాలని చెప్పారు. అంతకు మించి వారికి డైఫర్స్ కూడా మార్చాలని చెప్పడంతో ఇంటిలోని సభ్యులు షాక్ కి గురయ్యారు. 

ఇక పిల్లలుగా ఆరియానా, అమ్మ రాజశేఖర్, హారికల అల్లరి పీక్స్ లో ఉంది. అమ్మ రాజశేఖర్, హారిక బొమ్మల కోసం కొట్టుకున్నారు. అంకుల్ అంటూ ఆరియాన సోహైల్ తో ఓ ఆట ఆడుకుంది. ఈ టాస్క్ లో గెలిచినవారికి ప్రయోజనం ఉంటుందని బిగ్ బాస్ చెప్పగా, అందరూ శక్తి వంచన మేర కష్టపడుతున్నారు. 

 అమ్మ రాజశేఖర్ బాధ్యత అభిజిత్ కి అప్పగించిన బిగ్ బాస్, ఆరియానా బాధ్యత సోహైల్ కి , హారిక బాధ్యత మోనాల్ కి , మెహబూబ్ బాధ్యత అఖిల్ కి, అవినాష్ బాధ్యత నోయల్ కి అప్పగించారు. టాస్క్ లో భాగంగా పిల్లలకు కేర్ టేకర్స్ డైపర్స్ మార్చారు.