బిగ్ బాస్ హౌజ్ లో ముందు నుంచీ కంటెస్ట్ చేస్తున్న అర్చన(వేద) వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ లోకి ప్రవేశించిన దీక్షా పంథ్ హౌజ్ లో ఇద్దరు గ్లామర్ డాల్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం 47వ రోజున ఒకరినొకరు కౌగిలించుకుని ఫ్రెండ్స్ అయిపోయిన దీక్ష,అర్చన
ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో రాను రాను మాంచి ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఇప్పటికే కంటెస్టంట్స్ తమతమ కేరక్టర్స్ ఏంటో బైటపెడుతున్నారు. ఒకరిద్దరు సభ్యులు మినహా మిగతా అందరూ తమ రియల్ కేరక్టర్ ఏంటో జనానికి అర్ధమయ్యేలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఎందుకో తెలీదుకానీ ముందు నుంచి దీక్షా పంథ్ ను శత్రువుగా ఫీలవుతున్న అర్చన 47వ రోజు కూడా సాయంత్రం వరకు ద్వేషించేది. ఇద్దరి మనసులో ఒకరిపై ఒకరికి తెలియని ద్వేషం వుండేది. దీక్ష కొంత బెటర్ అనిపించినా అర్చన మాత్రం తగ్గేదే లేదన్నట్లు బిహేవ్ చేసింది. అయితే సడెన్ గా ఇద్దరూ 47వ రోజు సాయంత్రం ఆరు ఆరున్నర ప్రాంతంలో.. ఏకాంతంగా మాట్లాడుకుని కాంప్రమైజ్ అయ్యారు. కానీ నమ్మశక్యంగా లేదు.
ఎందుకంటే రోజు ప్రారంభమయ్యాక ఉదయం 9.30కు దీక్షకు కాఫీ ఇవ్వాలి అని ముమైత్ చెప్పటంతో అర్చనకు కోపం వచ్చింది. నిన్న సారీ చెప్పినా మూతి అదోలా పెట్టి బిల్డప్ ఇస్తోందంటూ.. కాఫీ ఎవరికి కావాలో వాళ్లు అడుగుతారు, అడగందే నేనెందుకు ఇస్తానంటూ దీక్షకు కాఫీ ఇవ్వకుండా అర్చన బెట్టు చేసింది. మరోవైపు అందరికీ ఒకసారే కాఫీ పెడితే బాగుంటుంది కదా, నేను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం ఏంటని దీక్ష వాదన. నాకొక్కదానికే కాఫీ చేస్తోందా అని ముమైత్ ని అడిగింది దీక్ష. అంతేకాక ఊరికేనే నాతో ఫైట్ చేస్తది అని అర్చనఫై ముమైత్ కు ఫిర్యాదు చేసింది దీక్ష. నన్ను ఎందుకు నవ్వుతున్నవు అని అడుగుతోంది. అలా అడుగుతారా ఎవరైనా.. నవ్వటం కూడా తప్పేనా.. నాతో ఏంటి ప్రాబ్లెమ్ అంటూ ముమైత్ తో గోడు చెప్పుకుంది.
మరోవైపు నేనేంటో నీకు తెలుసు కదా.. నన్ను దీక్ష ప్రతిసారి అవమానపరుస్తోంది. నన్ను నిన్న చాలా హర్ట్ చేసింది. నేను ఆ అమ్మాయి గురించి పట్టించుకోను. నేను తనతో ఫైట్ చేయలేను అని ముమైత్ కు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది అర్చన.
అదే సమయంలో ఎంటరైన శివబాలాజీ... కాఫీ కావాలని అడిగితే ఇస్తుంది తప్ప.. వచ్చి ఎలా ఇస్తారు అని దీక్షను కసిరినట్లు చెప్పాడు. దాంతో నాతో గొడవ ఎందుకు పడుతున్నారని దీక్ష ప్రశ్నించింది. వెంటనే గొడవ అంటే వేరేలా వుంటుంది అని శివ బాలాజీ అన్నాడు. ఆ వెంటనే ముమైత్ జోక్యం చేసుకుని గొడవ పెద్దది కాకుండా సెట్ చేసింది. తర్వాత కాసేపు బెడ్ రూమ్ లో హరితేజ, దీక్ష మధ్య కాఫీ గురించిన సంభాషణ జరిగింది. దీక్షతో మాట్లాడుతూ అర్చన కాఫీ అడిగిన వాళ్లకి పెట్టిందని హరితేజ చెప్పింది.
తర్వాత దీక్ష ముమైత్ తో మాట్లాడుతూ.. అర్చన ప్రతీసారి ఓవర్ రియాక్ట్ అవటం వల్లే గొడవ జరిగింది. కెప్టెన్ కాఫీ ఇమ్మని చెప్పినా వినకుంటే నేనేం చేయను. ఆమెతో గొడవ పెట్టుకోకున్నా.. ఏవేవో వూరికే ఊహించుకుని నాపై అభాండాలు వేస్తోందంటూ ఏడిచింది దీక్ష.
ఇక మధ్యాహ్నం ముమైత్ ఖాన్ జోక్యం చేసుకుని అర్చనను దీక్ష కోసం కాఫీ అఢగ్గా శివబాలాజీ జోక్యం చేసుకుని నువ్వెందుకు అడుగుతున్నావనని అన్నాడు. నవదీప్ మాట్లాడుతూ ఇవాళ కాఫీడే అని అసలు తిండి,కాఫీలు మానేస్తే గొడవ వదులుతుందని కమెంట్ చేశాడు.
అనంతరం ముమైత్ అర్చన దగ్గరికి వెళ్లింది. అప్పుడు నేను బాధపడేది ఆ అమ్మాయి గురించి కాదు.. నేను ఆ అమ్మాయికి కాఫీ చేయను. నాకిష్టం లేదంటే లేదు. నేను అందరి ముందు సారీ చెప్పాను. అయినా ఏదేదో అంది అంటూ అర్చన ఏడుస్తూ తన గోడు వెళ్లబోసుకుంది. ముఖ్యంగా ముమైత్ ఖాన్ తనకు చాలా క్లోజ్ అని అలాంటి ముమైత్ తన సమస్య చెప్పుకుంటుంటే వినకుండా ఏదేదో మాట్లాడుతూ తన మనసును గాయపరిచిందని, తనతో క్లోజ్ గా.. వుండేవాళ్లు అలా బిహేవ్ చేస్తే తాను తట్టుకోలేనంటూ అర్చన కంటతడి పెట్టింది. దీంతో అర్చనను ఓదార్చటమే సరిపోయింది ముమైత్ కు. చివరకు తాను సారీ చెప్పి మరీ అర్చనను ఏడుపు ఆపించేందుకు ముమైత్ ప్రయత్నించింది.
మరోవైపు దీక్ష తనలో తాను మాట్లాడుకుంటూ వుండగా ప్రిన్స్ అటుగా వచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నావని అడగ్గా...నాలో నేనే మాట్లాడుకుంటున్నా..నాకు పిచ్చెక్కుతోంది ఈ ఇంట్లో అంది దీక్ష. అలా సాయంత్రం ఆరు గంటల తర్వాత దాకా శత్రుత్వం కొనసాగింది. కానీ సడెన్ గా వీళ్లిద్దరూ కలిసి బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
సాయంత్రం తర్వాత తనను శత్రువులా భావించే అర్చనను బాధపడుతుంటే... ఓదార్చేందుకు దీక్ష కూడా ప్రయత్నించింది. దగ్గరికి తీసుకుని నీపై ఎలాంటి చెడు అభిప్రాయం లేదని చెప్పి అర్చనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. మనం ఎందుకు కొట్లాడుతున్నామో అర్థం కావట్లే. టాస్క్ టాస్క్ దగ్గరే వదిలేసెయ్. మార్నింగ్ కూడా ఏం జరగలేదు. నువ్వు హార్ట్ కి తీసుకోకు. నీకేమన్నా నచ్చకుంటే.. నాకు చెప్పు అని దీక్ష ఓపెన్ గా అర్చనతో మాట్లాడింది. అనంతరం మనం గొడవపడొద్దంటూ ఇద్దరూ పరస్పరం కౌగిలించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది.
అయితే.. ఇన్ని వారాలుగా గొడవపడ్డ అర్చన, దీక్షలు ఇప్పుడు కౌగిలించుకుని కాంప్రమైజ్ అయ్యారా.. అసలు కడుపులో ఏముంది. కౌగిలించుకుంటే అపోయినట్టేనా ఇంకా మిగిలే వుందా అన్న సందేహాలు సగటు ప్రేక్షకుని మదిని తొలుస్తున్నాయి. మరి వీళ్లిద్దరూ ఇలాగే ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తారా లేక మళ్లీ మొదటికే వస్తారా చూడాలి. మరోవైపు ఇద్దరినీ బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎవరవుతారోననే టెన్షన్ పీడిస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వాళ్లలో వీళ్లిద్దరూ వున్నారు. వీళ్లేకాక ముమైత్,నవదీప్,ప్రిన్స్ కూడా నామినేటై వున్నారు.
