బిగ్ బాస్ లో మరింత కఠినమైన టాస్కులు మొదలవుతున్నాయనిపిస్తుంది. ఎపిసోడ్స్ గడిచే కొద్దీ ఇంటి సభ్యులకు అసలైన పరీక్ష ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి తోడు ఈ వారం ఎలిమినేషన్స్ ప్రక్రియ కూడా చాలా సీరియస్ గా సాగింది. ఎలిమినేషన్ కొరకు నిర్వహించిన టాస్క్ లో వాదోపవాదాలు జరిగాయి. కాగా నేడు బిగ్ బాస్ హోటల్ పేరుతో ఓ గేమ్ నిర్వచించనున్నాడు బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ లగ్జరీ హోటల్ లో కొందరిని సర్వెంట్స్ గా, కొందరిని కస్టమర్స్ గా విభజించడం జరిగింది. 

ఈ టాస్క్ నందు కస్టమర్స్ గా మెహబూబ్ మరియు సోహైల్ ఉన్నారు. కస్టమర్ గా వెయిటర్స్ కి ఆర్దర్స్ ఇచ్చే క్రమంలో మెహబూబ్ ఎందుకో సీరియస్ అయ్యాడు. ఎవడికైనా పగిలిపోతుందని వార్నింగ్ ఇచ్చాడు.  ఈ విషయంలో హద్దులు దాటొద్దని అఖిల్ మరియు మెహబూబ్ కి మధ్య వివాదం నడిచింది. అవినాష్ పైన కూడా మెహబూబ్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. 

అఖిల్, అభిజిత్ మరియు అమ్మ రాజశేఖర్  కస్టమర్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి  కఠిన పరీక్షలలో పాల్గొనడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ అభిజిత్, పుష్ అప్స్ చేస్తూ అఖిల్ మరియు స్విమ్మింగ్ పూల్ దూకుతూ పైకెక్కుతూ అమ్మ రాజశేఖర్ కుప్పగూలిపోయారు.   ఇక అవినాష్ కి కూడా బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు.