Pushpa: పుష్పలో కేశవ పాత్రను మిస్ చేసుకున్న బిగ్ బాస్ స్టార్ ఎవరో తెలుసా..?
పుష్ప సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) తో పాటు అందరిని ఆకర్షించిన మరో పాత్ర కేశవ. ఈ పాత్ర చేసి జగదీష్ కు ఈ సినిమాతో కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయ్యింది. నిజానికి ఈ పాత్రకోసం ఓ ఫేమస్ యాక్టన్ ను అనుకున్నారట.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) తో పాటు అందరిని ఆకర్షించిన మరో పాత్ర కేశవ. ఈ పాత్ర చేసి జగదీష్ కు ఈ సినిమాతో కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయ్యింది. నిజానికి ఈ పాత్రకోసం ఓ ఫేమస్ యాక్టన్ ను అనుకున్నారట.
సినిమాల్లో కొన్ని పాత్రలు కొంత మంది కోసమే పుట్టినట్టు ఉంటాయి. అవి వారు చేస్తేనే అద్భుతంగా ఉంటాయి. అలంటి వాటిలో చిన్నా పెద్దా.. అనే తేడా ఉండదు. అలాంటి పాత్రల్లో పుష్ప లోని కేశవ పాత్ర కూడా ఒకటి. సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో.. అది కూడా అల్లు అర్జున్(Allu Arjun) లాంటి స్టార్ హీరోతో ఫుల్ లెన్త్ క్యారెక్టర్.. అవన్నీ పక్కన పెడితే.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్.. ఐదు భాషల్లో ఫేమ్.. ఇంత కథ కమాషీ ఉన్న పాత్రను సాధారణంగా ఎవరికి ఇస్తారు...? ఇండస్ట్రీలో బాగా ఫేమ్ ఉన్న యాక్టర్ కు ఇస్తారు కాని పుష్పలో కేశవ పాత్ర మాత్రం జగదీష్ అనే జూనియర్ ను వరించింది.
ఈ క్యారెక్టర్ చేసిన జగదీష్ అనే కుర్రాడు ఇండస్ట్రీలో నాలుగేళ్లుగా ఎన్నో కష్టాలు అనుభావించాడు. అతని నాలగేళ్ల కృషికి.. ఇంత అద్బుతమైన పాత్ర వచ్చింది. అయితే ఈ పాత్ర కోసం ముందు గా చాలా మందిని అనుకున్నారట. దీని కోసం చాలా మందిని ఆడిషన్ కూడా చేశారట సుకుమార్. కాని ఫైనల్ గా జగదీష్ ను కన్ ఫార్మ్ చేశారట. అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనుకన్న వాళ్లలో బిగ్ బాస్ ఫేమ్.. యూట్యూబ్ స్టార్.. యాక్టర్ మహేష్ విట్టా(Mahesh Vitta) కూడా ఉన్నాడట.
మహేష్ విట్టా అయితే రాయలసీమ స్లాంగ్ ను పర్ఫెక్ట్ గా పలకగలడు. తన వీడియోలు అన్నీ కూడా రాయలసీమ యాసలోనే ఉంటాయి. దాంతో మహేష్ వైపు మొగ్గు చూపారట సుకుమార్ తో పాటు మూవీ టీమ్ అంతా. అంతే కాదు ఈ ఆడిషన్ లో మహేష్ కూడా వెళ్లాట. అక్కడ మహేష్ కు సీన్ పేపర్స్ కూడా ఇచ్చి.. దాదాపు కన్ ఫార్మ్ చేసినంత పని చేశారట. ఈ విషయాన్ని మహేష్ విట్టా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాని చివరకు ఓ కొత్త కుర్రాన్ని తీసుకున్నారు అని తెలిసింది అన్నారు మహేష్ విట్టా. కాని ఈ పాత్రలో ఓ కొత్త టాలెంట్ కు లైఫ్ వచ్చింది.
ఇక సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా.. రష్మిక హీరోయిన్ గా పాన్ ఇండియా రేంజ్ లో.. ఐదు భాషల్లో తెరకెక్కిన పుష్ప మూవీ డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి ప్రపంచ వ్యప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. పాన్ ఇండియా లెవల్లో బన్నీ ఇమేజ్ ను నిలబెట్టింది ఈమూవీ. పుష్ప నుంచి ఫస్ట్ పార్ట్ మూవీ రిలీజ్ అవ్వగా.. సెంకడ్ పార్ట్ ను మూవీన ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేయాలిన ప్లాన్ చేస్తేన్నారు టీమ్.