ఉత్కంఠ మధ్య కుమార్ సాయి నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులలో అందరూ సేవ్ కాగా చివరకు మోనాల్, కుమార్ సాయి మిగిలారు. ఇద్దరిని లగేజ్ సర్దుకొని కన్ఫెషన్ రూమ్ కి రమ్మన్న నాగార్జున మోనాల్ ని సేవ్ చేసి, కుమార్ సాయిని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి స్టేజ్ పైకి రావాలని చెప్పారు. స్టేజ్ పైకి వచ్చిన కుమార్ సాయి ఇంటి సభ్యులను వారి తత్వాల ఆధారంగా కూరగాయలతో పోల్చి చెప్పడం జరిగింది. 

కాగా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన సభ్యులను గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కుమార్ సాయిని కూడా రాహుల్ ఇంటర్వ్యూ చేయడంతో ఆయన బిగ్ బాస్ హౌస్ అనుభవాలతో పాటు ఇంటి సభ్యుల తీరును, వాళ్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. లాస్యది ఫేక్ స్మైల్ అన్న సాయి, దివి తనను రాజశేఖర్ కాపాడతాడని భావిస్తుంది అన్నాడు. 

అవినాష్ కి నామినేషన్ అంటే భయం అని, నామినేట్ కాకూడదని కోరుకుంటూ ఉంటాడని అన్నాడు. సోహైల్ ఎప్పుడూ టెంపర్ తో ఉండడంతో పాటు, ఎదుటివాళ్లకు కూడా టెంపర్ తెప్పిస్తాడని అన్నాడు.రాజశేఖర్ తన కామెడీ ఇతరులను తగ్గించడానికి వాడతారు అన్నాడు.సోహైల్ ఫ్రెండ్ షిప్ వాడుకుంటూ ఎప్పుడు తనే గెలవాలి అనుకుంటాడు అన్నాడు.  అఖిల్ గురించి కుమార్ సాయి కొన్ని ఘాటు వాఖ్యలు చేశాడు. అఖిల్ కి బుద్ధికి...బలానికి సింక్ లేదన్నాడు. బలం మాత్రమే ఉండి ఏమి లాభం అన్నాడు. 

అఖిల్ మరియు అభిజిత్ మధ్య మనస్పర్థలకు గొడవలకు మోనాల్ కారణం అని కుమార్ సాయి కుండబద్దలు కొట్టాడు. ఆమె దగ్గర ఒక వైలిన్ ఉంటుందని, తన మూడ్ కి తగ్గట్టుగా వాయిస్తూ ఉంటుందని కుమార్ సాయి చెప్పడం జరిగింది.