బిగ్ బాస్ హౌస్ నుండి ఐదవ వారం బయటికి వచ్చేసింది జోర్దార్ సుజాత. ఎలిమినేషన్ కొరకు ఎంపికైన వారిలో చివరికి అమ్మ రాజశేఖర్, సుజాత మిగలగా వీరిద్దరిలో అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న సుజాత ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీనితో హౌస్ నుండి సుజాత బయటికి రావడం తప్పలేదు. సుజాత టాస్క్ ల పరంగా పర్వాలేదనిపించినా కొన్ని విషయాలు ఆమెపై ప్రేక్షకులలో నెగెటివ్ ఒపీనియన్ కలిగేలా చేశాయి. ముఖ్యంగా సుజాత నవ్వు మరియు నాగార్జునను బిట్టూ అని పిలవడం. 

చిన్న చిన్న విషయాలకు కూడా సుజాత ఎడతెరిపి లేకుండా నవ్వేది. ఆ నవ్వు బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చక పోగా అది ఒక ఫేక్ స్మైల్ అన్న అభిప్రాయానికి వచ్చారు. దీనికి మించి హీరో నాగార్జునను బిట్టూ అని పిలవడం జనాలకు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా ఈ విషయంలో నాగార్జున అభిమానులు నొచ్చుకున్నారని తెలుస్తుంది. సుజాత ఎలిమినేట్ కావడానికి కారణమైన బిట్టూ పిలువు వెనుక కారణాన్ని సుజాత చెప్పుకొచ్చింది. 

నిజానికి సుజాత హోస్ట్ నాగార్జునను బిట్టూ అని ముద్దుగా పిలవడానికి కారణం షో నిర్వాహకులేనట. సుజాతను మనం సినిమాలో నాగార్జున ముద్దు పేరు బిట్టూ, ఆ పేరుతో పిలవడం నీకు ఇష్టమేనా అన్నారట. వాళ్ళ సూచనల మేరకే సుజాత నాగార్జునను బిట్టూ అని పిలిచింది అట. నేను అలా చేయడం తప్పు అని భావిస్తే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి వద్దని చెప్పేవాడు అని చెప్పింది. నాగార్జున అభిమానులు నొచ్చుకొని ఉంటే క్షమాపణలు అని ఆమె తెలిపారు.  ఇదంతా షో నిర్వాహకుల పనే అని తెలుస్తుండగా, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షోనా అనే అనుమానం కలుగుతుంది.