బిగ్ సీజన్ 4 నిస్సారంగా సాగుతుంది. గత మూడు సీజన్స్ లో లేని విధంగా అతి తక్కువ రేటింగ్ దక్కించుకుంటుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు బిగ్ బాస్ టాస్క్ లు కూడా ఇందుకు కారణం. తాజాగా ఇంటి సభ్యులకు విధించిన టాస్క్ నిస్సారంగా సాగుతుంది. రాక్షసులు మరియు మనుషుల టాస్క్ ఏమంత ఆసక్తికరంగా లేదు. 

ఇంటి సభ్యుల మధ్య పోటాపోటీ పోరు కనిపించడం లేదు. దీనితో ఈ టాస్క్ తేలిపోయింది. అంతకు మించి పెద్ద తికమక ఈ టాస్క్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. దీనితో ఈ టాస్క్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. బిగ్ బాస్ షో మేనేజర్స్ కాన్సెప్ట్ డిజైనర్స్ పై కూడా నెగెటివ్ ఒపీనియన్ డెవలప్ అవుతుంది.
 
 వెంట్రుకలు కత్తిరించుకోవడం, అరగుండు వంటి టాస్క్ లో ప్రేక్షకులలో ఆసక్తి రగిలించినా వ్యతిరేకత కూడా తెచ్చి పెట్టాయి. హౌస్ లో ఎలాంటి టాస్క్ లో అవసరం లేదని కొందరు అభిప్రాయం. అలాగే నామినేషన్స్ విషయంలో కూడా పారదర్శకత లేదని అభిప్రాయం వెల్లడవుతుండగా, బిగ్ బాస్ షో మరింత ఆదరణ కోల్పోయే ప్రమాదం ఉంది. 


దాదాపు మరో రెండు నెలలు బిగ్ బాస్ షో కొనసాగాల్సివుంది. ఇలా ఐతే ఈ సీజన్ అట్టర్ ప్లాప్ అయినట్టే. కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు దీనిపై ద్రుష్టి సారించాలి. ఆసక్తి రేపే టాస్క్ లతో బిగ్ బాస్ హౌస్ సిద్ధం చేయాలి. చూద్దాం... ఆడియన్స్ ఒపీనియన్ ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారో!