ప్రస్తుతం టాలీవుడ్ లో బిగ్ బాస్ షో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. హోస్ట్ గా నాగార్జునని ఫైనల్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.

ఇక కంటెస్టంట్ లుగా ఎవరు కనిపించబోతున్నారనే విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి. కొందరు సెలబ్రిటీలు దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు. తాజాగా ఓ టాలీవుడ్ కపుల్ పేరు వినిపిస్తోంది. 'హ్యాపీడేస్' సినిమాతో టాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్న వరుణ్ సందేశ్ ఈ షోలో పాల్గొంటాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

దీనిపై ఈ హీరో స్పందించలేదు. ఇప్పుడు వరుణ్ సందేశ్ తో పాటు అతడి భార్య నటి వితికా షేరు కూడా షో లో పాల్గొంటుందని అంటున్నారు. ఈసారి బిగ్ బాస్ షో కోసం రెండు జంటలను ఎంపిక చేశారని.. అందులో వరుణ్ సందేశ్, వితికాలు ఉన్నారని టాక్.

షోలో కొన్ని గేమ్స్ కూడా వారికి తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారట. కెరీర్ పరంగా వరుణ్, వితికాలు బాగా వెనుకబడ్డారు. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. బిగ్ బాస్ షోలో గనుక వీరికి ఛాన్స్ వస్తే కచ్చితంగా అది వారికి కెరీర్ కి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.