నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ నజ్రియా ఫహద్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ చిత్ర ప్రమోషన్స్ ను యూనిట్ తాజాగా ప్రారంభించింది. ఈ క్రమంలో నాని ఫ్యాన్స్ కు బిగ్ అనౌన్స్ మెంట్ అందించారు. 

నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ కు బిగ్ అనౌన్స్ మెంట్ అందింది. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో బిగ్ సక్సెస్ ను అందుకున్న నాని తాజాగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈమేరకు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. సినిమాపై ఆసక్తిని పెంచేందుకు మేకర్స్ వరుస అప్డేట్స్ అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

తాజాగా నాని అభిమానులకు మేకర్స్ బిగ్ ట్రీట్ అందించేందుకు అనౌన్స్ మెంట్ అందించారు. మే 30న ఉదయం 11:07న ‘అంటే సుందరానికీ’ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. చాలా డీసెంట్ గా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ప్రమోషన్స్ కోసం నాని తను నటిస్తున్న ‘దసరా’ చిత్రానికి కూడా కాస్తా బ్రేక్ ఇచ్చాడు. Dasaraలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటిస్తోంది.

కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అంటే సుందరానికీ’లో నాని సుందర ప్రసాద్ పాత్రను పోషిస్తుండగా.. హీరోయిన్ నజ్రియా లీలా పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి నవీన్ యేర్నెని, వై రవి శంకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 10న తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ రిలీజ్ కానుంది. 

Scroll to load tweet…