'బిగ్ బాస్' కొత్త సీజన్ లో భూమిక?
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భూమికా చావ్లా తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటోంది. గ్లామర్ క్యారెక్టర్స్తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ విజయవంతమైన చిత్రాల్లోనటించిన భూమిక బిగ్ బాస్ తో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
మూడు నెలల కింద జనాలు ఎవరికీ పెద్దగా తెలియని వాళ్లు కూడా ఒక్కసారి బిగ్ బాస్ లలోకి ఎంటర్ అయితే ఆ తర్వాత తెలియని వాళ్లంటూ ఉండరేమో అనేంతగా క్రేజ్ తెచ్చుకుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వారిపై జరిగే డిస్కషన్స్ బాగా ప్లస్ అవుతాయి. అలాంటివాళ్లను ఎందిరినో చూసాము. బిగ్ బాస్ లో అన్ని రోజుల పాటు తనదైన ఆటలతో ఆకట్టుకున్నవారు బయటికి వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ పెంచుకుంటున్నాము. వాళ్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ కూడా మిలియన్ దాటిపోతున్నారు.
సినిమాల్లో కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ఓ మాదిరి వాళ్ల పరిస్దితే ఇలా ఉంటే ఆల్రెడీ సినిమాల్లో చేస్తున్నవాళ్లకు ఉండే వాళ్లు ఈ షోకు వస్తే పరిస్దితి ఎలా ఉంటుంది. వారికి డబ్బు పరంగా కూడా బాగానే ముట్ట చెప్తారు. షోకు కూడా ఆల్రెడీ పాపులర్ ఫిగర్స్ వల్ల ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. అందుకేనేమో ఇప్పుడు బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కు భూమికను ఎప్రోచ్ అవుతున్నట్లు సమాచారం. అయితే అది తెలుగు బిగ్ బాస్ కాదు. హిందీ.
బిగ్ బాస్ షోలలో హైయిస్ట్ సక్సెస్ అయ్యియంది మాత్రం హిందీ బిగ్ బాస్ షో . ఇప్పటికే 14 సీజన్స్ సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేసుకుని, 15వ సీజన్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా భూమిక చావ్లా బిగ్‌బాస్ 15లో కనిపడే అవకాసం ఉందని బాలీవుడ్ మీడియా అంటోంది.
అలాగే సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 15కోసం భూమిక పేరును మేకర్స్ ను సూచించినట్టు చెప్పుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి తేరే నామ్ చిత్రంలో నటించింది భూమిక. ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలిచింది. అయితే ఈ షోలో చేయటానికి భూమిక ఒప్పుకుంటుందా..? లేదా అనేది తెలియాల్సిన విషయం.
బాలీవుడ్లో తేరేనామ్, గాంధీ మై ఫాదర్, రన్ లాంటి సినిమాల్లో నటించిన భూమిక నార్త్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. ప్రస్తుతానికి చేతిలో సినిమాలు ఏమీ లేని భూమిక సరైన క్యారెక్టర్ దొరికితే సౌత్లో కూడా ఎంట్రీకి రెడీ అంటోంది.