ఖుషి సినిమాతో టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్న క్యూట్ బ్యూటీ భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి పాత్రలను ఎంచుకుంటోంది. నట జీవితంలో అన్ని తరహా పాత్రలను చేయాలనీ ముందుకు సాగుతోంది. MCA సినిమాతో సౌత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న భూమిక వచ్చిన అవకాశాల్ని ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు. 

అనసూయ - అమరావతి సినిమాలలో డిఫరెంట్ రోల్స్ చేసిన అమ్మడు మళ్ళీ ఆ తరువాత అలాంటి పాత్రల్లో కనిపించలేదు. ఇక రీసెంట్ గా కోలీవుడ్ లో  ఒక థ్రిల్లర్ జానర్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. భయపెట్టే క్యారెక్టర్ తో పాటు ఎమోషనల్ లైన్స్ సినిమాలో ఆకట్టుకుంటాయట. ఉదయనిధి స్టాలిన్ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. 

తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేసేందుకు భూమిక పాత్రను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఆమె పాత్రను హైలెట్ చేయనున్నారట. మా మారన్ దర్శకత్వం వహించనున్న ఈ థ్రిల్లర్ సినిమాలో ఆత్మికా కథానాయికగా నటిస్తోంది.