Asianet News TeluguAsianet News Telugu

ఈ బాలీవుడ్ భామ చాలా మందితో డేటింగ్ చేసిందట..

  • బాలీవుడ్ లో ఇటీవల సెన్సేషనల్ కమెంట్స్ తో ఆకట్టుకుంటున్న భూమి పడ్నేకర్
  • తాజాగా తాను ఎంతో మందితో డేటింగ్ చేశానంటున్న భూమి
  • అయితే అదంతా బాలీవుడ్ కు రాకముందేనట

 

bhumi pednekar says she dated any

బాలీవుడ్ హీరోయిన్లు వార్తల్లో ఉండేందుకు రకరకాల గిమ్మిక్కులు చేస్తుంటారు. ఫోటో షూట్లతో, వివాదాస్పద కమెంట్లతో... స్కిన్ షోలతో రకరకాలుగా తమవైపు దృష్టి మరల్చేలా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో బాలీవుడ్ బ్యూటీ చేరింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన దమ్ లగాకే హైస్సా సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన బ్యూటీ భూమీ పెడ్నేకర్.

 

తొలి సినిమాలో భారీకాయంతో కనిపించిన ఈ భామ తరువాత స్లిమ్ లుక్ లోకి మారిపోయిన హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునే పనిలో ఉంది. అయితే బాలీవుడ్ కాంపిటీషన్ లో ఉండేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది భూమి. తాను మోడ్రన్ యువతినన్న భూమి, బాలీవుడ్ కి పరిచయం కాకముందు చాలా మందితో డేటింగ్ చేశానని తెలిపింది.

 

అంతేకాదు తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నాని, ఇంత వరకు ఏ హీరోతోనూ వరుస సినిమాలు చేయలేదు హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ వస్తున్న వార్తలని అబద్ధమని కొట్టిపడేసింది. ప్రస్తుతానికి తనూ తన వృత్తినే పెళ్లి చేసుకున్నానన్న భూమి పెడ్నేకర్, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios