BholaShankar Trailer: మెగాస్టార్ విశ్వరూపం.. `భోళాశంకర్` ట్రైలర్ మాస్ జాతరే.. ఫ్యాన్స్ కి పూనకాలే
చిరంజీవి హీరోగా నటించిన `భోళాశంకర్` చిత్ర ట్రైలర్ విడుదలైంది. గ్లోబల్ స్టార్,చిరు తనయుడు రామ్‌చరణ్ ఈ ట్రైలర్‌ని విడుదల చేయడం విశేషం. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ `భోళాశంకర్`. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. గ్లోబల్ స్టార్,చిరు తనయుడు రామ్‌చరణ్ ఈ ట్రైలర్‌ని విడుదల చేయడం విశేషం. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా అన్ని అంశాల మేళవింపుగా ఉంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ట్రైలర్.. జాతర సీన్ల నుంచి ప్రారంభమైంది. వరుసగా అమ్మాయిలు, చిన్నపిల్లలు మిస్ అవుతుంటారు. చివరకు ఔరాలోనూ ఆ మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. అనంతరం విలన్ ఎంట్రీ ఇస్తాడు. తనదైన భారీ డైలాగులతో రెచ్చిపోతున్న నేపథ్యంలో గూస్ బంమ్స్ తెప్పించేలా ఫైటింగ్ సీన్లతో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇస్తారు. విలన్లని వరుస బెట్టి సంహారం చేస్తుంటాడు. అంతలోనే కామెడీ ట్రాక్‌లోకి మళ్లుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ ఎలిమెంట్లు, చిరంజీవి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ సీన్లతో నింపేశారు చివరికి విలన్లని ఊచకోత కోస్తుంటారు చిరంజీవి. ఇక శ్రీముఖితో సీన్, మురళీశర్మతో వచ్చే సీన్‌తోపాటు చివర్లో పవన్ కళ్యాణ్ మేనరిజం. `హ..` అంటూ ముగించారు. ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. అయితే ఇందులో చిరంజీవి చాలా యంగ్‌గా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. తమిళంలోవ విజయం సాధించిన `వేదాళం` చిత్రానికి రీమేక్. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. కీర్తిసురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన చిత్రమిది. భారీ బడ్జెట్‌తో రూపొందింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్. ఇప్పటికే మూడు పాటలు విడుదల చేసింది. టీజర్‌ని రిలీజ్ చేసింది. వాటికి మంచి స్పందన వచ్చింది.ఇప్పుడు ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. డైరెక్ట్ ఫిల్మ్ అనే భావన తెప్పిస్తుంది.
ఇదిలా ఉంటే చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో `వాల్తేర్ వీరయ్య`తో హిట్‌ని అందుకున్నారు. ఈ సినిమా సుమారు 250కోట్లు వసూలు చేసింది. దీంతో సక్సెస్ జోరులో ఉన్న చిరుకి ఇప్పుడు `భోళాశంకర్` మరో హిట్ మూవీ కాబోతుందని తెలుస్తుంది. అంతేకాదు `వాల్తేర్ వీరయ్య` సక్సెస్ ప్రభావం ఇప్పుడు ఈ మూవీపై కూడా ఉండటం విశేషం. అందుకే మెగా ఫ్యాన్స్ ఇప్పట్నుంచే సంబరాలు స్టార్ట్ చేస్తున్నారు.