చిరంజీవి హీరోగా నటిస్తున్న `భోళాశంకర్` సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి రెండో పాట ని విడుదల చేయబోతున్నారు. సాయంత్రం ప్రోమో రాబోతుంది.
మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తోన్న `భోళాశంకర్` మూవీపై మాస్‌లో మంచి క్రేజ్ నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్ ర్యాంపేజ్ లా సాగింది. మాస్ ఆడియెన్స్ కి ఫీస్ట్ లా ఉంది. సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతుంది. దీంతో సినిమా నుంచి వరుసగా అప్‌డేట్లు ఇస్తుంది యూనిట్. ఇప్పటికే టీజర్‌తోపాటు ఓ సాంగ్‌ని విడుదల చేశారు. ఇది శ్రోతలను ఆకట్టుకోవడంతోపాటు ఫ్యాన్స్ ని అలరించింది. రెండో పాటకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది యూనిట్.
ఇప్పుడు మరో పాటని విడుదల చేయబోతుంది. తాజాగా చిత్ర బృందం ఆ విషయాన్ని వెల్లడించింది. `జామ్ జజ్జనక` అంటూ సాగే పాటని రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సాంగ్ ప్రోమోని, మంగళవారం పాటని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఇందులో చిరంజీవి కలర్‌ఫుల్ డ్రెస్ ధరించి మాస్ స్టెప్పుతో కనిపిస్తున్నారు. ఇది మాస్ ఆడియెన్స్ కి, చిరు ఫ్యాన్స్ ని ఊర్రూతలూగించేదిగా ఉండబోతుందని అర్థమవుతుంది.
సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న `భోళాశంకర్` సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఫెయిల్యూర్‌లో ఉన్న ఆయన ఈ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఇందులో చిరంజీవికి చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తుండగా, హీరోయిన్‌గా తమన్నా నటిస్తుంది. మహతి స్వరసాగర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
పూర్తి కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర(అనిల్ సుంకర)నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాది సంక్రాంతికి `వాల్తేర్ వీరయ్య`తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు చిరంజీవి. అది ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు `భోళాశంకర్` మూవీపై అంచనాలు నెలకొన్నాయి. టీజర్ కూడా బాగుండటంతో థియేటర్లలో మెగాస్టార్ మరోసారి రచ్చ చేయబోతున్నారని చెప్పొచ్చు.
