మరో వారం రోజుల్లో విడుదల ఉండగా... ప్రసాద్ ల్యాబ్స్ లో భీమ్లా నాయక్ ఫైనల్ కాపీ సిద్ధం అవుతుంది. నేడు లేదా రేపు సెన్సార్ జరుపుకోనున్న భీమ్లా నాయక్ (Bheemla Nayak)చిత్రానికి కొత్తగా కొన్ని సన్నివేశాలు జోడించారన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.

భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25న భారీగా విడుదల కానుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ కూడా మొదలయ్యాయి. యూఎస్ లో భీమ్లా నాయక్ నాలుగు వందలకు పైగా థియేటర్స్ లో విడుదలవుతున్నట్లు సమాచారం. యూఎస్ తెలుగు ప్రేక్షకులు భీమ్లా నాయక్ చిత్రం పట్ల ఆసక్తిగా ఉన్నారని బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది. పవన్ (Pawan Kalyan)కెరీర్ లోనే భీమ్లా నాయక్ అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్లా నాయక్ హిందీ వర్షన్ కూడా విడుదల చేయడం మరో కొసమెరుపు. బాలీవుడ్ లో పవన్ సత్తా చాటేందుకు ఇదొక గొప్ప అవకాశమని చెప్పాలి. 

అయితే భీమ్లా నాయక్ చిత్రం నిడివి పెంచినట్లు తెలుస్తుంది. గతంలో భీమ్లా నాయక్ కేవలం రెండు గంటల ఇరవై నిమిషాలు మాత్రమే అని ప్రచారం నడిచింది. ఓ స్టార్ హీరో సినిమాకు అంత తక్కువ నిడివి అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మధ్యకాలంలో టూ టైర్ హీరోల సినిమాలు కూడా 160 నుండి 180 నిమిషాల నిడివి కలిగి ఉంటున్నాయి. అలాంటి పవన్ సినిమా కేవలం అంత తక్కువ సమయమా అంటూ ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు. 

తాజా సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ చిత్ర నిడివి 12 నిమిషాల వరకూ పెంచారట. పోలీస్ స్టేషన్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ కలిపి మొత్తం పది నిమిషాలకు పైగా నిడివి పెంచారట. భీమ్లా నాయక్ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ మొదట కొన్ని సన్నివేశాలు తొలగించారట. ఇప్పుడు తొలగించిన ఆ సన్నివేశాలతో పాటు అదనంగా పాట జోడించినట్లు ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 

భీమ్లా నాయక్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ కి తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే పవన్ కోసం అసలు కథకు అదనపు హంగులు జోడించారు. దానిలో భాగంగానే ఒరిజినల్ కథలో లేని సన్నివేశాలు, పాటలు భీమ్లా నాయక్ సినిమాలో ఉంటాయి. ఇక భీమ్లా నాయక్ నిడివి పెంచారనేది ఫ్యాన్స్ కి ఆనందం పంచే అంశమే. మొత్తంగా భీమ్లా నాయక్ తో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడతామని పవన్ ఫ్యాన్స్ శబధం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మోతమోగిస్తున్నారు. 

ఇక భీమ్లా నాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ పోలీస్ రోల్ చేస్తున్నారు. మరో హీరో రానా ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ తెరకెక్కిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకుడు.