మొదటి మూడు రోజులు అదరగొట్టిన పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్, మొదటి సోమవారం పూర్తిగా చతికిలపడింది. ముఖ్యంగా మార్నింగ్, మ్యాట్నీ షోస్ లో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదు. దీంతో సినిమా ప్లాప్ దిశగా నడుస్తుందా అని మీడియాలో వార్తలు వచ్చాయి.
కొంత కాలం గ్యాప్ తర్వాత తెలుగులో వచ్చిన భారీ సినిమా భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. రానా దగ్గుబాటి మరో లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా మొన్న శుక్రవారం రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ కు నేరేషన్ పరంగా చిన్నపాటి మార్పులు తెరకెక్కించారు. త్రివిక్రమ్ అందించిన స్క్రీన్ ప్లే ఒరిజినల్ కంటే రేసిగా ఉందని అందరూ అన్నారు. అలాగే మాటల మాంత్రికుడు, డైలాగ్స్ విషయంలో కూడా ఇంప్రెస్ చేసాడు. ఒరిజినల్ తో పోలిస్తే మరింత మాస్ గా ఉంది ఈ చిత్రం. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. సాంగ్స్ బాగున్నాయి. ఇక బీజీఎమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో సాగింది.
ఇలా మొదటి మూడు రోజులు అదరగొట్టిన పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్, మొదటి సోమవారం పూర్తిగా చతికిలపడింది. ముఖ్యంగా మార్నింగ్, మ్యాట్నీ షోస్ లో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదు. దీంతో సినిమా ప్లాప్ దిశగా నడుస్తుందా అని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే నిన్నటి రోజు భీమ్లా నాయక్ పండగను పూర్తిగా క్యాష్ చేసుకుంది.
మహా శివరాత్రి సందర్భంగా భీమ్లా నాయక్ కు మళ్ళీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దాదాపు అన్ని థియేటర్లలో, ఏ షో అన్నది సంబంధం లేకుండా హౌస్ ఫుల్స్ పడ్డాయని సమాచారం. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతంలో దుమ్మురేపింది. ఊహించని విధంగా డ్రాప్ అవుతుందనుకున్న టైమ్ లో భీమ్లా నాయక్ కు మహా శివరాత్రి సెలవు పెద్ద బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి.
ఈ రోజు నుండి చిత్రం ఎలా హోల్డ్ అవుతుంది అనే దాన్ని బట్టి హిట్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే నైజాం, ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది ఈ చిత్రం. భీమ్లా నాయక్ ఒరిజినల్ కంటే బెటర్ గా, ఒరిజినల్ కంటే మాస్ గా తెరకెక్కించటమే కలిసొచ్చింది. రానా దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ తమ తమ పాత్రల్లో చెలరేగిపోయానటం అతిశయోక్తి కాదు. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య మడమతిప్పని యుద్ధం అని టీమ్ ఈ చిత్రం గురించి ప్రమోట్ చేసింది. భీమ్లా నాయక్ కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రమే కాక అందరినీ మెప్పిస్తోంది. మాస్ ఎంటర్టైనర్ గా నిలిచింది.
