‘భీమ్లా నాయక్’: ‘డానియల్ శేఖర్’ గ్లింప్స్ వీడియోకు డేట్ ఫిక్స్
సంపన్న యువకుడి పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పాత్రపేరే 'భీమ్లా నాయక్'. రానా పాత్ర పేరు డానియల్ శేఖర్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా రూపోందుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్ కోషియుమ్ చిత్రం రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో పోలీసు అధికారి పాత్రలో పవన్ కల్యాణ్ మెరువనున్నారు. అలాగే సంపన్న యువకుడి పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పాత్రపేరే 'భీమ్లా నాయక్'. రానా పాత్ర పేరు డానియల్ శేఖర్.
పవన్ పాత్ర ప్రధానంగా మొన్న ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ‘రేయ్ డాని బయటకు రారా’ అనే డైలాగ్‌తో ప్రారంభం అయిన ఈ టీజర్‌లో పవన్ యాక్షన్ మరో లెవల్‌లో ఉంది. చివర్లో విలన్ ‘డాని.. డానియల్ శేఖర్’ అని అంటే.. పవన్ ‘భీమ్లా.. భీమ్లా నాయక్’ అంటూ మాస్ జవాబు ఇస్తారు. అయితే ఈ ఫస్టు గ్లింప్స్ లో తమ అభిమాన నటుడు కనిపించకపోవడం పట్ల రానా దగ్గుబాటి అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేయటం జరిగింది. ఈ నేపధ్యంలో రానా అభిమానులను కూడా ఖుషీ చేసేందుకు రంగం రెడీ అవుతోంది.
అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 17న రానా పాత్ర ప్రధానంగా ఒక టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.అది పవన్ కళ్యాణ్ టీజర్ మించి ఉంటుందని అంటున్నారు. నిజానికి ‘భీమ్లా నాయక్’ వీడియో రిలీజ్ అయిన రోజే…. నిర్మాత అయిన నాగవంశీ ఓ నెటిజన్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు. ‘అప్పుడే నిర్ణయానికి వచ్చేయొద్దు… అన్నీ ఓ లెక్క ప్రకారం జరుగుతాయి’ అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అందుకు తగ్గట్టే రానా పాత్ర అయిన డేనియల్ శేఖర్ పాత్రకు సంబంధించి ఓ వీడియో సిద్ధమవుతోందట.
సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ కనిపించనుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సినిమాను జనవరి 12, 2021కి విడుదల చేస్తున్నామని ప్రకటించిన చిత్ర యూనిట్.. పాటలను సెప్టెంబర్ 2 నుంచి విడుదల చేస్తామని ప్రకటించారు.