భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక(Bheemla Nayak Prerelease event) హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. మూవీలో కీలక రోల్ చేసిన రానా దగ్గుబాటి వేదికపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


ఈ సినిమా సందర్భంగా నేను కొందరు మేధావులను కలిశాను. వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. నేను తెలుగుతో పాటు చాలా భాషల్లో సినిమాలు చేశారు. అలాగే చాలా మంది స్టార్స్ తో పని చేశాను. కానీ వాళ్లలో పవన్ కళ్యాణ్ వేరు. పవన్ కళ్యాణ్ తో పని చేయడం వేరు. పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఇకపై నేను చేసే సినిమాలు విభిన్నంగా ఉంటాయి. తెలుగులో హీరో ఎలా కావాలో వెతుకుతున్న నాకు సమాధానం దొరికింది. 

అలాగే త్రివిక్రమ్ మరొక మేధావి. ఆయన తెలివితేటలకు సినిమాలలో ఉండాల్సింది కాదనిపిస్తుంది. ఇక ఈ మూవీలో గొప్ప నటులు ఉన్నారు. సముద్ర ఖని, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కి ధన్యవాదాలు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేటీఆర్ కి ధన్యవాదాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు మీ ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు అద్భుతం. భవిష్యత్ లో హైదరాబాద్ ఇండియన్ సినిమాకు హబ్ గా మారుతుందని బావిస్తున్నా అన్నారు. సమయాభావం కావడంతో రానా త్వరత్వరగా ముగించారు. 

అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కింది. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భీమ్లా నాయక్ హిందీ వర్షన్ కూడా విడుదల కావడం మరో విశేషం. పవన్ కళ్యాణ్ మరొకరు మారు పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నారు. మరో హీరో రానా ఆర్మీ అధికారి పాత్ర చేస్తున్నారు. భీమ్లా నాయక్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇగో వార్ అన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ మూవీలో పవన్ భీమ్లా నాయక్ గా, రానా డానియల్ శేఖర్ గా పరస్పరం తలపడనున్నారు. 

భీమ్లా నాయక్ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర సంగీతం అందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మలయాళ కుట్టి నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ జంటగా నటించారు. సంయుక్త మీనన్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.