`భీమ్లా నాయక్‌` ట్రైలర్‌ ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇందులో పవన్‌ కళ్యాణ్‌, రానాల మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇద్దరు కలిస్తే రచ్చే అనేలా ట్రైలర్‌నిచూస్తుంటే అర్థమవుతుంది. 

పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan), రానా(Rana) కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak). సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌ వచ్చేసింది. పవన్‌ ఫ్యాన్స్ కి కనువిందుగా నిలుస్తుంది. అభిమానులకు బెస్ట్ ట్రీట్‌గా నిలుస్తుంది Bheemala Nayak Trailer. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. విడుదలైన మూడు గంటల్లోనే ఏకంగా ఏడు మిలియన్స్‌ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇంకా ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. 

ఇందులో పవన్‌ కళ్యాణ్‌, రానాల మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇద్దరు కలిస్తే రచ్చే అనేలా ట్రైలర్‌నిచూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో సినిమాలోనూ ప్రధానంగా వీరిద్దరు మధ్య ఫైటింగ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని, అదే హైలైట్‌గా నిలుస్తుందని టాక్‌. అయితే ఈ ట్రైలర్‌పై మరో వాదన కూడా ఉంది. ఆశించిన స్థాయిలో ట్రైలర్‌ లేదని అనే టాక్‌ కూడా అభిమానులు, నెటిజన్ల నుంచి వినిపిస్తుంది. 

`లాలా .. భీమ్లా..`, `భీమ్లా నాయక్‌` వంటి పాటలు, ఫస్ట్ టీజర్‌, గ్లింప్స్ లు చూశాక పవన్‌, రానాల అభిమానులకే కాదు, నెటిజన్లు, సాధారణ ఆడియెన్స్ కి కూడా పూనకాలు వచ్చాయి. సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. సినిమాపై హైప్స్ క్రియేట్‌ అయ్యాయి. వీటి గురించి అందరు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. కానీ ట్రైలర్‌ చప్పగా సాగిందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. అయితే ఈ ట్రైలర్‌ని సాయంత్రం 8.10గంటలకు విడుదల చేయాలనుకున్నారు. కానీ గంట ఆలస్యంతో 9 గంటలకు రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌ని రెడీ చేయడంలో టైమ్‌ సరిపోకపోవడం వల్లే ఆలస్యమయ్యిందని, టైమ్‌ కారణంగానే ఈ సమస్య వచ్చిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన గత టీజర్, గ్లింప్స్ లో చూపించిన మోత ట్రైలర్‌లో చూపించలేకపోయారనే టాక్‌ వినిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం `భీమ్లానాయక్‌` ట్రైలర్‌ అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. సోమవారం జరగాల్సిన `భీమ్లా నాయక్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఆయనకు సంతాపంగా ఈ ఈవెంట్‌ని వాయిదా వేశారు. 

ఇలాంటి బాధాకర సమయంలో ఈవెంట్‌ నిర్వహించేందుకు తన మనసు ఒప్పుకోవడం లేదని, అందుకే ఈవెంట్‌ని వాయిదా వేస్తున్నామని పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. తాజాగా ఈ ఈవెంట్‌ని బుధవారంనిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 23న సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లోనే ఈ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్‌కి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ గెస్ట్ గా రాబోతున్నట్టు ప్రకటించారు. మరి వాయిదా అనంతరం నిర్వహించే ఈ ఈవెంట్‌కి ఆయన వస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది. 

మరోవైపు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా స్పెషల్‌ గెస్ట్ గా రాబోతున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా నిత్యా మీనన్‌, రానాకి జోడీగా సంయుక్త మీనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైలాగులు,స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు.