పవన్, రానా మధ్య యాటిట్యూడ్, ఇగో వార్ స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్ లో చూపిన ప్రతి షాట్ లో ఇద్దరూ తగ్గేదే లే అనే విధంగా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరికొద్దిరోజులోనే బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ సందడి షురూ కానుంది. పవన్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ట్రైలర్ కూడా వచ్చేసింది.
దీనితో సోషల్ మీడియాలో రచ్చ షురూ అయింది. పవన్, రానా మధ్య యాటిట్యూడ్, ఇగో వార్ స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్ లో చూపిన ప్రతి షాట్ లో ఇద్దరూ తగ్గేదే లే అనే విధంగా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. అయ్యప్పన్ కోషియం చూసిన వారికి కథ తెలిసే ఉంటుంది. కానీ చూడని వారికి పవన్, రానా మధ్య గొడవ ఏంటి అనే ఉత్కంఠ ఉంటుంది.
మొదటి నుంచి ఈ చిత్రం పవన్ కళ్యాణ్ పేరుతోనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అంటే కథలో పవన్ ని మరింత పవర్ ఫుల్ గా చూపించేందుకు మార్పులు ఏమైనా చేశారా అనే అనుమానం కూడా కల్గింది. కానీ ట్రైలర్ లో మాత్రం ఇద్దరికీ సమానమైన ప్రయారిటీ ఇచ్చినట్లు అనిపించింది. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.
ఇక ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ చివర్లో చెప్పే 'నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలకి వస్తే కష్టం' అనే డైలాగ్ బాగా వైరల్ కావడం ఖాయం. లోతుగా ఆలోచిస్తే ఈ డైలాగ్ గురించి పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. ఈ డైలాగ్ ద్వారా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో సంకేతం పంపినట్లుగా భావించే అవకాశం కూడా ఉంది.
ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలో పొలిటికల్ మీటింగ్ పెట్టి హీట్ పెంచారు. భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుండడంతో టికెట్ ధరల వ్యవహారం కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. చిరంజీవి జగన్ ని చేతులు జోడించి వేడుకోవడంపై కూడా పవన్ బాగా హర్ట్ అయ్యారని అర్థం అవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ డైలాగ్ కూడా హాట్ టాపిక్కే.
