మరోవారం రోజుల్లో భీమ్లా నాయక్ (Bheemla Nayak)థియేటర్స్ లో దిగనున్నాడు. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ వరల్డ్ వైడ్ గా తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు భీమ్లా నాయక్ షూట్ కంప్లీట్ చేసినట్లు దర్శకుడు సాగర్ కె చంద్ర షూట్ చేశారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వారు కోరిన విధంగా ఫిబ్రవరి 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం థియేటర్స్ లో వంద శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామంటూ నిర్మాతలు ప్రకటించారు. ఏపీలో టికెట్స్ ధరలు పెంపుతో పాటు 100% సీటింగ్ కెపాసిటీకి అనుమతి లభించిన నేపథ్యంలో ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ విడుదల చేయాలని మేకర్స్ భావించారు.
థియేటర్స్ పూర్తి సీటింగ్ కెపాసిటీతో నడుపుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించడం జరిగింది. అలాగే టికెట్స్ ధరల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దీనితో భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నారు. యూఎస్ లో భీమ్లా నాయక్ టికెట్స్ బుకింగ్స్ మొదలైపోయింది. విడుదలకు ఈ స్థాయిలో ఏర్పాటు జరుగుతుండగా భీమ్లా నాయక్ షూట్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. ఓ పాటతో పాటు మిగిలిన ఉన్న ఒకటి రెండు సన్నివేశాల చిత్రీకరణ కొద్దిరోజులుగా చేస్తున్నారు.
నేడు పూర్తిగా భీమ్లా నాయక్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ మేరకు దర్శకుడు సాగర్ కే చంద్ర ట్వీట్ చేశారు. భీమ్లా నాయక్ షూట్ ముగించినట్లు వెల్లడించారు. పవన్ తో సెట్లో దిగిన ఫోటో ట్విట్టర్ లో షేర్ చేశారు. పోలీస్ గెటప్ లో పవన్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. ఇక భీమ్లా నాయక్ రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఓపెనింగ్ డే భీమ్లా నాయక్ కొత్త రికార్డు సెట్ చేస్తుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక హిందీలో కూడా విడుదల చేస్తుండగా.. అక్కడ ఫలితంపై ఉత్కంఠ నెలకొని ఉంది.
మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ అధికారిక రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారి రోల్ చేస్తున్నారు. అపవాన్ ప్రత్యర్థి ఆర్మీ అధికారి పాత్రను రానా చేస్తున్నారు. వీరిద్దరి మధ్య నడిచే ఆధిపత్య పోరే భీమ్లా నాయక్ చిత్రం. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నిత్యా మీనన్ పవన్ కి జంటగా నటిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు.
