కొవిడ్ కారణంగా సంక్రాంతికి సినిమాల సందడి మిస్సయింది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన మెగాస్టార్ ఆచార్య కూడా పాండమిక్ కారణంగా వాయిదా పడింది.

కొవిడ్ కారణంగా సంక్రాంతికి సినిమాల సందడి మిస్సయింది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన మెగాస్టార్ ఆచార్య కూడా పాండమిక్ కారణంగా వాయిదా పడింది. దీనితో ఈ భారీ చిత్రాల విడుదల తేదీపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడిప్పుడే ఈ చిత్రాల విడుదల విషయంలో క్లారిటీ వస్తోంది. దర్శకనిర్మాతలు చర్చలు జరిపి విడుదల తేదీలు ఖరారు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న విడుదుల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక మెగాస్టార్ ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ సానుకూలమైన చర్చల అనంతరం ఆచార్య చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేసేందుకు నిర్ణయించాం అని మేకర్స్ ప్రకటించారు. 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం కూడా విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అయితే ఈ చిత్రం కోసం నిర్మాతలు రెండు రిలీజ్ డేట్లు ప్రకటించారు. పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి 25నే విడుదల చేస్తాం. కుదరని పక్షంలో ఏప్రిల్ 1న విడుదల చేస్తాం అని ప్రకటించారు. 

ఒక వేళ భీమ్లా నాయక్ ఏప్రిల్ 1న విడుదలైతే ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోమారు పోటీ తప్పదు. ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న వస్తోంది. సో ఈ రెండు చిత్రాల మధ్య గ్యాప్ పెద్దగా ఉండదు. సంక్రాంతికి ఈ రెండు చిత్రాలు విడుదలవుతున్నప్పుడు పెద్ద రభసే జరిగింది. దీనితో నిర్మాతల మండలి రంగంలోకి దిగి భీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేసారు. కానీ కోవిడ్ కారణంగా ఆర్ఆర్ఆర్ కూడా రిలీజ్ కావడం కుదర్లేదు.

ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ కలసి నటిస్తున్న ఎఫ్3 చిత్రం కూడా సమ్మర్ బెర్త్ ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానున్న నేపథ్యంలో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ తప్పేలా లేదు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…