Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో అందరి హృదయాలని ఆకట్టుకుంటూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఈరోజు మార్చి 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో మందులు కొనడానికి షాప్ కి వెళ్లిన కృష్ణ ఎందుకు పెద్దత్తయ్య వాళ్ళు నందిని విషయంలో ఇలా చేస్తున్నారు. పాపం నందిని ఇన్నాళ్లు ఎంత బాధ భరించిందో. ఇంకా నయం చూసాను కాబట్టి సరిపోయింది లేకపోతే కోమాలోకి వెళ్లిపోయేదేమో అనుకుంటుంది. అయినా ఎందుకు నందిని గతం మర్చిపోవాలని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు.
అసలు సిద్దు ఎవరు ఈ ఒక్క ప్రశ్న కి సమాధానం తెలిస్తే కన్ఫ్యూజన్ కి తెరదించొచ్చు అనుకుంటుంది కృష్ణ. ఇంతలో షాప్ వాడు టాబ్లెట్స్ ఇవ్వటంతో అవి తీసుకొని వచ్చేస్తుంది. మరోవైపు కృష్ణ అన్న మాటలు తలుచుకుంటుంది భవాని. అంతలోనే అక్కడికి వచ్చిన ఈశ్వర్ మీరు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతాడు.
అవును ఇప్పటి వరకు నేను ఎవరి విషయంలోనూ తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. ఇది కేవలం నందిని జీవితానికి సంబంధించిన విషయమే కాదు మన కుటుంబ పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం అందుకే ఇన్నాళ్లు రహస్యాన్ని గుట్టుగా ఉంచాను. ఎప్పటికీ ఆ రహస్యం అలాగే ఉంటుంది అంటుంది భవాని. కానీ కృష్ణ సీనియర్ డాక్టర్ సహాయంతో నందినిని బాగు చేస్తానంటుంది అంటాడు ప్రసాద్.
పేషెంట్ ని చూడకుండా ఏ డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాయడు, మీరు కంగారుపడి నన్ను కంగారు పెట్టకండి అంటుంది భవాని. మీరు ఏం చేసినా మన ఇంటికోసమే చేస్తారు మీ మీద ఆ నమ్మకం ఉంది కృష్ణ గురించి నేను మురారితో మాట్లాడతాను అంటాడు ఈశ్వర్. కృష్ణని తేలికగా తీసుకోవటానికి లేదు ఎందుకైనా మంచిది మీరు తన ప్రతి కదలికని గమనించండి.
మనకి నందిని ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆమెకి గతం గుర్తుకు రాకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం అంటుంది భవాని. మరోవైపు ఇంటికి వెళ్లాలని ఉంది కానీ వెళ్ళటానికి భయంగా ఉంది. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో అని టెన్షన్ గా ఉంది ఇంట్లో స్వేచ్ఛ లేకుండా పోయింది దీనంతటికీ కారణం ముకుంద అంటూ తన బాధని గోపి తో చెప్పుకుంటాడు మురారి.
ముకుంద నీకు శత్రువు లాగా కనిపిస్తుంది కానీ నువ్వు తనకి శత్రువులాగా కనిపించకూడదా అంటాడు గోపి . ఏంటి అంటూ షాక్ అవుతాడు కృష్ణ. అవును నువ్వు తనని ప్రేమించావు ఆశలు కల్పించావు అడ్రస్ లేకుండా పోయావు ఇంకొకరిని పెళ్లి చేసుకోవటానికి రాక తప్పలేదు. వచ్చినప్పుడు నేను చూసింది,నిజం చెప్పమని బ్రతిమిలాడింది.
కానీ నువ్వు ఆదర్శ్ కోసం, నీ కుటుంబం కోసం ఆమె మాట వినలేదు. నువ్వేదో నీ ప్రేమని త్యాగం చేశాను అనుకుంటున్నావు కానీ నిజానికి త్యాగం చేసింది ముకుంద. తను తన జీవితాన్ని భవిష్యత్తుని కూడా త్యాగం చేసింది. నీకేమీ చక్కగా పెళ్లి చేసుకున్నావు మీ కుటుంబంతో సుఖంగా ఉన్నావు. ఇప్పుడొచ్చి ముకుంద వల్ల టార్చర్ అనుభవిస్తున్నాను అంటే అనుభవించు.
చేతులారా ఆమె జీవితాన్ని ఆదర్శ్ చేతిలో పెట్టి ఆమె జీవితాన్ని నాశనం చేసావు అందుకు శిక్ష అనుభవించు అంటాడు గోపి. మళ్లీ తనే వినటానికి ఇబ్బందిగా ఉందా ఫ్రెండ్ ని నాకే నువ్వు స్వార్థపరుడు లాగా కనిపిస్తున్నావు అలాంటిది ముకుంద దృష్టిలో నువ్వు నిజంగా మోసగాడు కనీసం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే తను నీ మీద జాలిపడేది.
ఇచ్చిన మాట కోసం ఒంటరిగా ఉండిపోయినందుకు సానుభూతి చూపించేది అంటాడు గోపి. నువ్వు ఇలా ప్రశ్నిస్తూ ఉంటే నా బాధని నీతో కూడా చెప్పుకోలేను అంటాడు మురారి. ముకుంద నీవల్ల ఎంత సఫర్ అవుతుందో చెప్పడం కోసం మాత్రమే చెప్పాను ఒక ఫ్రెండ్ గా నేను నిన్ను సమర్థిస్తే అది తప్పు అవుతుంది. జరిగింది ఎలాగూ మార్చలేము కనీసం జరగబోయేది అయినా ఎలా అడ్డుకోవాలో తెలిస్తే బాగుంటుంది అంటాడు మురారి.
ఎలా, ఏం చేస్తావు అయినా నువ్వు ముకుందని ఘాటుగా విమర్శించకూడదు. ఎప్పటికైనా నువ్వు తన ప్రేమకి లొంగిపోతావని ఆశతో ఉంది, అది దక్కదని తెలిసినప్పుడు ఏదైనా అఘాయిత్యం చేస్తే ఏం చేస్తావు అంటాడు గోపి. అలా అనొద్దు వినటానికి అదొక లాగా ఉంది. ఇప్పటికే ముకుంద కి నావల్ల అన్యాయం జరిగింది అలాంటిది ప్రాణాలు కూడా తీసుకుంటే చచ్చేవరకు నేను చస్తూ బ్రతకాలి.
ముకుందను మార్పు రావాలి తనకి ఇంతే రాసిపెట్టి ఉందని సర్దుకోవాలి.ఈ ప్రేమ, పెళ్లి అంతా యాక్సిడెంట్ లాంటిది అనుకొని అంతా మర్చిపోవాలి. అదే జరగాలి అంతకుమించి ఇంకేమీ జరగకూడదు అంటాడు మురారి.
మరోవైపు నువ్వు ఎంత నన్ను అవాయిడ్ చేస్తున్న నీ మీద ప్రేమ రోజురోజుకీ పెరిగిపోతుంది అనుకుంటుంది ముకుంద. నాకు నిన్ను ఇప్పుడే చూడాలని ఉంది.
మాట్లాడాలని ఉంది అనుకుంటూ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తుంది. ఏసీపి మురారి గారికి ఫోన్ ఇవ్వండి అని ముకుంద అంటే వారు లీవ్ లో ఉన్నారు మీరు ఎవరు అంటాడు అటువైపు వ్యక్తి. స్టేషన్ కి వెళ్లకుండా మురారి ఎక్కడికి వెళ్లి ఉంటాడు అనుకుంటుంది.నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఉంటాను నిన్ను ఒంటరిగా వదలను నిన్నే ఫాలో అవుతాను అనుకుంటూ తను కూడా బయటకు వెళ్తుంది ముకుంద.
మరోవైపు జరిగిన విషయాన్ని మురారికి చెప్పాలా వద్దా అనే ఆలోచనలో ఉంటుంది కృష్ణ. పెద్ద అత్తయ్య నన్ను ఏమైనా అంటారేమో అని ఆపేస్తారేమో అనుకుంటుంది మళ్లీ లేదు సార్ కి నిజం చెప్పాలి ఇంట్లో సపోర్ట్ కావాలంటే చెప్పి తీరాలి అనుకొని మురారి కి ఫోన్ చేసి ఒకసారి మా హాస్పిటల్ కి వస్తారా అని అడుగుతుంది. ఏమీ లేదు పికప్ చేసుకుంటారేమో అని అంటుంది కృష్ణ.
సరే అయితే కారెక్కు అంటాడు మురారి. కార్ రాకుండా ఎలా ఎక్కుతాను అంటుంది కృష్ణ. నువ్వు అనుకోని నించున్నది మన కారునే అంటూ గ్లాస్ డోర్స్ తీస్తాడు మురారి. షాకైన కృష్ణ సార్ మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది. తెలీదు నాకు నిన్ను మాట్లాడాలి, చూడాలి అనిపించింది. తెలియకుండానే నా కారు మీ హాస్పిటల్ కి వచ్చి ఆగింది అంటాడు మురారి.
మీకేమైనా సమస్య అంటుంది కృష్ణ. నాతో కూడా చెప్పుకోలేనిదా ఉంటుంది. అవును అంటాడు మురారి. అయితే చెప్పొద్దు అంటుంది కృష్ణ. కార్లోకి వెళ్తూ మూడిగా ఉన్న మురారిని చూసి ఈ టైంలో నందిని గురించి చెప్పటం కరెక్ట్ కాదు అనుకుంటుంది కృష్ణ. ఆగిపోవడంతో ఏమైందో చూద్దామని కిందకు దిగుతాడు మురారి. తను రిపేరు చేయటానికి ట్రై చేస్తాడు కానీ రిపేర్ అవ్వదు.
కారు ఆగిపోతే రవాణా వ్యవస్థ ఏమి ఆగిపోదు క్యాబ్లో అయినా వెళ్లొచ్చు. అయినా ఇంజన్ వేడెక్కి ఉంటుంది కాసేపు అయితే అదే ఆన్ అవుతుంది ఈలోపు మనం పానీ పూరి తిందాం అంటుంది కృష్ణ. నీకు ఇష్టమా అని మురారి అడిగితే మీకు ఇష్టం కదా అంటుంది కృష్ణ. సరే అంటూ అక్కడికి వెళ్లి చేతులు కడుక్కుంటూ సోపు ఉందా అని పానిపురి షాపు వాడిని అడుగుతాడు.
అవన్నీ వాడి దగ్గర ఎందుకు ఉంటాయి, ఈ నీళ్లు పెట్టడమే ఎక్కువ ఉంటుంది కృష్ణ. మరి ఎలా పని మురారి అంటే ట్విస్ట్ ఉంది రండి అంటూ మీకు ఒకటి నాకు ఒకటి అంటూ మురారి కి తినిపిస్తుంది కృష్ణ. మురారి నవ్వుతుంటే ఎందుకు అని అడుగుతుంది కృష్ణ. భార్యలు నోరు మూసుకునేది పానీపూరి బండి దగ్గరే అంటాడు మురారి.
కృష్ణ కి పానీపూరి పెడుతుంటే తను కూడా ఓ కప్పు పడుతుంది ముకుంద. తనని అక్కడ చూసి షాక్ అవుతారు కృష్ణ దంపతులు. ఏంటి అలా చూస్తున్నారు నాకు కూడా పాని ఇప్పుడు ఇష్టమే ఉంటుంది ముకుంద. సడన్ గా వచ్చేసరికి అర్థం కాలేదు అంటుంది కృష్ణ. సడన్ గా బండి కనిపించేసరికి ఆగిపోయాను. పానీ పూరి ఇష్టమైన ఫ్రెండ్స్ తో కలిసి తినేదాన్ని అంటూ మురారి వైపు చూస్తుంది ముకుంద.
నేను మీ ఆనందాన్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా అంటుంది ముకుంద. ఇందులో ఆనందపడే విషయం ఏముంది అయినా నువ్వేంటి ఎక్కడ అంటుంది కృష్ణ మా అమ్మ సారీస్ కొందంట స్టిచింగ్ కోసం బోటిక్ కి రమ్మంటే వెళ్తున్నాను అంటుంది ముకుంద. నువ్వు మురారి కి తినిపిస్తున్నావు మరి మురారి నీకు తినిపించడా అని అడుగుతుంది ముకుంద. ఆయన చేతులకి గ్రీస్ అంటుకుంది నా చేతిలో బానే ఉన్నాయి అంటుంది కృష్ణ.
నువ్వు ఆఫీసుకి వెళ్లలేదా అని మురారిని అడుగుతుంది ముకుంద. నేను ఆఫీస్ కి వెళ్ళలేదని నీకు ఎలా తెలుసు అంటాడు మురారి. అంటే ఈ టైంలో ఇక్కడ ఉన్నావు కదా అందుకే అడిగాను అయినా ఏం చేస్తారులే ఉమ్మడి కుటుంబంలో కొత్తజంటకి ప్రైవసీ ఉండదు. ఇంట్లో తెలియకుండా లీవ్ పెట్టి సరదాగా ఇలా గడపాలి. మురారి ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నాడు.
నేను ఇంట్లో చెప్పనులే అంటుంది ముకుంద. చెప్తే తప్పేముంది అయినా పానీ పూరి తినటం పాపమేమీ కాదు కదా అయినా ఆయన తినేది ఆయన భార్యతోనే కదా, వేరే వాళ్ళతో తింటే టెన్షన్ పడాలి అంటుంది కృష్ణ. తరువాయి భాగంలో నందినికి గతం మరిచిపోయే టాబ్లెట్స్ మేమెందుకు ఇస్తాము అంటుంది భవాని.
అయితే తప్పు ఆ డాక్టర్ దే వాడొద్దు ఈ టాబ్లెట్స్ వాడమని డాక్టర్ గౌతమ్ చెప్పారు ఉంటుంది కృష్ణ. నేను నందిని తల్లిని తనని ఎలా చూసుకోవాలి నాకు తెలుసు అంటుంది భవాని. నందిని కి తప్పుడు మెడిసిన్ ఇచ్చి తనని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన డాక్టర్ని వదలను. ఏసిపి సార్ ఆఫీస్ కి వెళ్లి ఆ డాక్టర్ మీద కేస్ ఫైల్ చేస్తాను ఉంటుంది కృష్ణ. ఆ మాటకి భవానితో సహా అందరూ షాక్ అవుతారు.
