Asianet News TeluguAsianet News Telugu

Krishna Mukunda Murari: విషమంగా మారిన నందిని ఆరోగ్యం.. కృష్ణని ఇంట్లోంచి బయటికి వెళ్ళమన్న భవాని!

Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల హృదయాలని దోచుకుంటూ మంచి రేటింగ్ తో ముందుకి దూసుకుపోతుంది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంతో సాగుతుంది ఈ కధ. ఇక ఈరోజు మార్చి 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Bhavani family gets worried about nandini health condition in todays krishna mukunda murari serial gnr
Author
First Published Mar 17, 2023, 12:50 PM IST

ఎపిసోడ్ ప్రారంభంలో ఆ తింగరి పిల్ల రాత్రంతా తినకుండా పడుకొని ఉండి ఉంటుంది వెళ్లి భోజనానికి తీసుకొని రా అని రేవతికి చెప్తుంది భవాని. అంత అవసరం లేదు తను రాత్రి తినకుండా ఏమి పడుకోలేదు మురారి ఆమెని బయటకు తీసుకెళ్లి  కడుపునిండా తినిపించాడు, అందుకు నేనే సాక్ష్యం అంటుంది ముకుంద. అంతలోనే మురారి దంపతులు కిందికి వస్తారు.

అక్కడ సిట్యుయేషన్ చూసి జరిగిందంతా ముకుంద చెప్పేసి ఉంటుందని అర్థం చేసుకుంటారు.డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన మురారిని నీ భార్యకి శిక్ష వేసిన సంగతి తెలియదా అంటుంది భవాని. ఆకలి తో బాధపడుతుందని  తీసుకెళ్లాను అంటాడు మురారి. అంటే నా మాటని మీరి ఆమెని తీసుకువెళ్లావా,అయినా నిర్ణయాలు తీసుకోవటానికి నువ్వు ఎవరివి.

ఈ ఇంటి పెద్దని నేను, ఇంట్లో ఎవరు క్రమశిక్షణ తప్పినా క్షమించను ఒక్కరిని వదిలేస్తే అదే అలుసుగా తీసుకుంటారు అందరూ. నీకు ఎంత ధైర్యం నా మాట ధిక్కరించడానికి అంటుంది భవాని. నేను ఆమె భర్తని తాళి కట్టినప్పుడే ఆమె బాధ్యతని స్వీకరించాను. కట్టుకున్న భార్యని పస్తులు ఉంచకూడదని నేను ఈ ఇంట్లోనే నేర్చుకున్నాను అంటాడు మురారి.

మరి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భార్యని, పరాయి మగవాడి బండిమీద వచ్చిన భార్యని మందలించే హక్కు లేదా అంటుంది భవాని. లేదు, ఆలస్యంగా వచ్చిన భార్య ఎంత అలిసిపోయిందో అని ఆలోచించాలి,భార్యని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చినందుకు ఆ మనిషికి కృతజ్ఞతలు చెప్పాలి అంటాడు మురారి. నా భార్య ఆకలికి తట్టుకోలేకపోయింది తను తినలేదని నేను కూడా తినలేదు.

నిండు ఇంట్లో ఎవరు పస్తులు పడుకున్నా అందుకు కారణమైన వాళ్ళని అన్నపూర్ణాదేవి క్షమించదని అమ్మ చెప్పింది. అందుకే ఇద్దరం కలిసి బయటికి వెళ్లి తినాల్సి వచ్చింది అంటాడు మురారి. నా మాటని కాదని కృష్ణని బయటికి తీసుకెళ్లి భోజనం పెట్టావని చాలా కోపం వచ్చింది. ఈ ఇంటి పెద్దగా ఇంట్లో వాళ్ళని క్రమశిక్షణలో ఉంచవలసిన బాధ్యత నాది. ఒక భార్యకి భర్తగా పూర్తి బాధ్యత నీ మీద ఉంది.

కానీ తప్పు చేస్తే నిన్ను కూడా క్షమించను ఈ నిబంధనను అతిక్రమించినందుకు అంటూ ఏదో మాట్లాడుతూ ఉండగానే నందు గట్టిగా కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ కంగారుగా ఆమె చుట్టూ చేరతారు. ఆమెని టెస్ట్ చేసిన కృష్ణ అర్జెంటుగా తనని హాస్పిటల్ తీసుకెళ్లాలి అంటుంది కృష్ణ. మరోవైపు నందు ఫోటో చూస్తూ నా అనుమానమే నిజమైంది.

నీ వాళ్లు నిన్ను కావాలని పిచ్చిదాన్ని చేస్తున్నారు అనుకుంటాడు గౌతమ్. ఇంతలో నందుని హాస్పిటల్ కి తీసుకు వస్తారు ఆమె కుటుంబ సభ్యులు. గౌతమ్ వాళ్ళు ఎవరు తనని గుర్తు పట్టకుండా జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేయడానికి వస్తాడు. వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ వీళ్ళని బయట పంపించేయండి అని స్టాఫ్ కి చెప్తాడు. రిపోర్ట్స్ రావడంతో  గౌతమ్ కి ఇవ్వాలని పిలుస్తుంది సిస్టర్.

కానీ గత జ్ఞాపకాల్లోకి వెళ్లిన గౌతమ్ కి వినిపించదు. కృష్ణ గట్టిగా పిలవడంతో ప్రస్తుతానికి వచ్చి ఆ రిపోర్ట్ చూసి మెడిసిన్స్ ఫార్మసీ నుంచి తీసుకురమ్మని సిస్టర్ ని పంపిస్తాడు. ప్రమాదం లేదు తనని చూసుకోవటానికి నేనున్నాను అంటూ కృష్ణకి ధైర్యం చెప్తాడు గౌతమ్. నేను ఇచ్చిన టాబ్లెట్ వల్లే ఈ రియాక్షన్ వచ్చింది నేను ఇలా ఎందుకు చేసానో నీకు రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది.

ఈ టాబ్లెట్ నేను ఇచ్చినట్లుగా ఎవరికి చెప్పొద్దు అంటూ కృష్ణని కూడా బయటికి పంపిస్తాడు గౌతమ్. బయటికి వచ్చిన కృష్ణని భవాని నానా మాటలు అంటుంది నేను ఎంత వద్దని చెప్పినా టాబ్లెట్ మార్చావు. ఇంతవరకు తీసుకొచ్చావు  అంటుంది. మేమందరినీ తనకి శత్రువులను పనుకున్నావా అయినా మేం వాడుతున్న మందులు వదిలేసి నువ్వు టాబ్లెట్స్ వేయటం మొదలు పెట్టాను.

అయినా సీనియర్ డాక్టర్ రాసిన టాబ్లెట్స్ ని మంచివి కావు అని చెప్పే రైట్స్ నీకు ఎక్కడివి అంటూ మందులిస్తాడు ఈశ్వర్. నా కూతురు విషయంలో జోక్యం చేసుకోవద్దని ఎంతలో ఉండాలో అంతలో ఉండమని చెప్పాను. ఇన్నాళ్లు తను పిచ్చిలో తను వుండిపోయేది ఇప్పుడు సమయానికి ఉత్తరేణి ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది. తనకి ఏమైనా అయితే నిన్ను నిందించి మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది భవాని.

 ఎప్పుడూ  ఏది వద్దంటే ఆ పని చేయటమే నీపనా, ఇప్పుడు నీ వల్లే నందిని కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ ముకుంద కూడా కృష్ణని మందలిస్తుంది. ఎంత మురారి ఇచ్చిన అలుసు, ఇంటి విషయాలు చూసుకోవడానికి మనకి పెద్దదిక్కు ఉంది కదా ఎందుకు ఇంతవరకు తీసుకురావాలి, ఇకనుంచైనా ఎలా ఉండాలో నీ భార్యకి ఎలా ఉండాలో నేర్పించు అని మురారిని మందలిస్తాడు ప్రసాద్.

 బాబాయ్ మీరిచ్చే మందుల వల్ల ఏం జరుగుతుందో కృష్ణ చెప్పడం పక్కన పెట్టండి కానీ నందిని కూడా తలలో నరాలు చిట్లిపోతున్నట్లుగా ఉంటుందని చెప్పింది కదా దాన్నేమంటారు, తను నా భార్య బాబాయ్ తనని ఏమైనా అంటుంటే నాకు చాలా బాధనిపిస్తుంది అంటాడు మురారి. తప్పు చేసినప్పుడు మాటలు పడాలి, అయినా ఈ టింగరి పిల్లకి మనం మర్యాద ఇచ్చేది ఏంటి అంటుంది భవాని.

 నేను మీ ఇంటికి కొత్తగా వచ్చాను, వచ్చిన దగ్గర్నుంచి నందిని నా మీద అభిమానం పెంచుకుంది. నేను కూడా నందిని సొంత చెల్లెలాగే చూసుకున్నాను. నాకు ఏ మందులు వేస్తే మంచిదో,ఏ మందులు వేయకపోతే మంచిదో తెలుసు అయినా ఇలా ఎందుకు జరిగిందో ఆ భగవంతుడికి తెలియాలి, నేను ఇది కావాలని చేసింది కాదు అంటూ చేతులు జోడించి నన్ను నమ్మండి అంటూ బ్రతిమాలుకుంటుంది కృష్ణ.

 మరోవైపు నందినిని చూస్తూ కన్నీరు పెట్టుకుంటాడు గౌతమ్. అప్పుడే స్పృహలోకి వచ్చిన నందిని గౌతమ్ ని గుర్తుపట్టి సిద్దు అని పిలుస్తుంది మళ్ళీ మగతలోకి  వెళ్ళిపోతుంది. నువ్వు గతం మర్చిపోయిన నన్ను మర్చిపోలేదు నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. నిన్ను ఎలా అయినా కాపాడుకుంటాను ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావు అంటూ నందిని పిలుస్తాడు గౌతమ్.కానీ మగతలో ఉన్న నందిని కి వినపడదు.

 తరువాయి భాగంలో నందిని కి నేను శత్రువుని కాదు ఎందుకు అందరూ నన్ను అనుమానిస్తున్నారు అంటుంది కృష్ణ. కృష్ణ నందిని మీద ప్రయోగాలు చేస్తుంది. తన ప్రయోగం ఫెయిల్ అవుతుందని తెలిసి టాబ్లెట్ వేసింది. ఈ టాబ్లెట్స్ మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందని రాసి ఉంది అంటూ టాబ్లెట్ రేపర్ ని చూపిస్తుంది ముకుంద. ఇంటికి నీవల్ల ద్రోహం జరిగింది అందుకే నిన్ను ఇంట్లోంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాను అంటుంది భవాని.

Follow Us:
Download App:
  • android
  • ios