కోలీవుడ్ లో ఇటీవల నిత్యం ఎదో ఒక వివాదం జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దర్శకుడు భారతీ రాజాకు సంబందించిన వార్తలు ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిగ్ గా మారాయి. రీసెంట్ గా తన దర్శకుల సంఘం అధ్యక్ష్య పదవికి రాజీనామా చేసిన షాకిచ్చిన భారతీ రాజా ఎన్నికల్లో ఏకగ్రీవ తీర్పును పక్కనపెట్టేశారు. 

అలా జరిగితే ఎలాంటి సమస్యలు చెలరేగుతాయో నాకు తెలుసనీ అందుకే సరైన పద్దతిలో ఎన్నికలు జరగాలని అన్నారు. మొన్న జరిగిన నడిఘర్ సంఘం ఎలక్షన్ లో భారతీరాజా విశాల్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక గతవారం నుంచి తమిళ దర్శకుల అధ్యక్ష పదవికి సంబందించిన ఎన్నికల హడావుడి కూడా మొదలైంది. 

ఈ తరుణంలో చాలా మంది దర్శకులు భారతీరాజాను ఏకగ్రీవకంగా ఎనుకున్నారు. అయితే అందుకు భారతీ రాజా ఒప్పుకోలేదు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎలక్షన్ జరగాలని కమిటీ సబ్యులతో చర్చించారు. ఈ నెల 14న కోలీవుడ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి సంబందించిన ఎలక్షన్స్ జరగనున్నాయి.