శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయి.. ప్రముఖ డైరెక్టర్ ఆగ్రహం

Bharathiraja Attacks Sri Reddy on her allegations
Highlights

శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని, అలాంటిది వాటితో ఆమె ప్రచారం పొందాలనుకోవడం కరెక్ట్ కాదని ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి సినిమా వారందరినీ తప్పుబట్టడం సరికాదని ఆయన సూచించారు

టాలీవుడ్ ను కాస్టింగ్ కౌచ్ మహమ్మారి పట్టిపీడిస్తోందని దాన్ని అరికట్టే దిశగా పాటుపడతానని మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులపై ఆరోపణలు చేసింది. అసభ్యపదజాలంతో ఆమె చేస్తోన్న కామెంట్స్ భరించలేని కొందరు తారలు ఆమెపై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ ను కొద్దిరోజుల పాటు పక్కన పెట్టి కోలీవుడ్ కు వెళ్లింది.

దర్శకుడు మురుగదాస్, సుందర్ సి, లారెన్స్, శ్రీకాంత్ వంటి తమిళ తారలు తనను అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి వాడుకున్నట్లు సంచలన కామెంట్స్ చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఇండస్ట్రీ పెద్దలు శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నటుడు వారాహి ఆమెపై చెన్నై కమీషనర్ కార్యాలయంలో కంప్లైంట్ చేశారు. వ్యభిచారం కేసు కింద ఆమెను అరెస్ట్ చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

నటుడు కార్తీ కూడా ఆమె దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి కానీ ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం ఏంటని ఫైర్ అయ్యాడు. తాజాగా సీనియర్ దర్శకుడు భారతీరాజా కూడా ఈ వ్యవహారంపై స్పందించాడు. శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని, అలాంటిది వాటితో ఆమె ప్రచారం పొందాలనుకోవడం కరెక్ట్ కాదని ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి సినిమా వారందరినీ తప్పుబట్టడం సరికాదని ఆయన సూచించారు. 

loader