బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి దేశమంతటా క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ లో ఈ షోకి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే 11 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 12వ సీజన్ లోకి ఎంటర్ అవుతుంది.

ఈ నెల నుండే ఈ షో టెలికాస్ట్ కానుంది. 'విచిత్ర జోడీస్' అనే థీమ్ తో ఈ షో నడవనుంది. ఇప్పుడు ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ ల వివారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా వారు తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై పెద్ద చర్చ సాగుతోంది. ఈ సీజన్ లో పాల్గొనబోయే సెలబ్రిటీ జంట బాలీవుడ్ నటి, కమెడియన్ భారతి సింగ్ ఆమె భర్త హార్ష్ లింబాచియాలు వారానికి ఏకంగా యాభై లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే వారు అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి నిర్వాహకులు ముందుకు వచ్చారు. భారతి సింగ్ కి వారానికి ముప్పై లక్షలు చొప్పున, ఆమె భర్త హార్ష్ కి 15 లక్షల చొప్పున ఇవ్వబోతున్నారా. ఈ సీజన్ లో అత్యధిక పారితోషికం అందుకోబోయే జంట వీరేనని చెబుతున్నారు.