సల్మాన్ ఖాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'భారత్'. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో సల్మాన్ ఖాన్ ఐదు విభిన్న గెటప్స్ లో చూపిస్తూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కత్రినా కైఫ్ ప్రభుత్వ అధికారిణిగా తన గెటప్ తో మెప్పించింది. సినిమాలో దిశా పటాని మరో ముఖ్య పాత్రల్లో కనిపించనుంది.

భారత్ అనే వ్యక్తి దేశంతో కలిసి చేసిన ప్రయాణం ఎలాంటిదనే.. కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రంజాన్ కానుకగా జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.