ఫస్ట్ డే పెద్దగా రికార్డులు కొట్టలేకపోయిన మహేష్

First Published 21, Apr 2018, 1:32 PM IST
Bharath Ane Nenu First collections in telugu states
Highlights

భరత్ అనే నేను ఫస్ట్ డే కలెక్షన్స్ 

కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన 'భరత్ అనే నేను' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోను మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లని నమోదు చేసుకుంది. 
ఏరియా వైస్ గా భరత్ అనే నేను ఫస్ట్ డే కలెక్షన్స్
నైజాం             4.48
సీడెడ్             2.47
ఉత్తరాంధ్ర        2.91
ఈస్ట్               3.21
వెస్ట్                1.82
కృష్ణా               1.93
గుంటూరు        4.04
నెల్లూరు           0.88
టోటల్  షేర్     21.74 
గ్రాస్                 31.84

ఏపీ లో రోజుకు ఐదుషోలకు పర్మిషన్ ఉండడంతో ఏపీ షేర్ ఎక్కువగా ఉంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే మొదటి రోజున 31.84 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టాడు మహేష్ బాబు. ఇది మహేష్ కు కెరీర్ బెస్ట్ కావడం విశేషం. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ చూస్తే తొలి రోజున 45 కోట్లు వచ్చాయి. కానీ ఈ సారి మహేష్ రికార్డలు పెద్దగా కొట్టలేక పోయాడు. ఒక గుంటూరు, కృష్ణా  తప్పితే ఇక ఎక్కడా అనుకున్నంత స్థాయిలో రాలేదు.

loader