సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సీఎం

First Published 16, Apr 2018, 4:32 PM IST
Bharath ane nenu censor completed
Highlights

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సీఎం

శ్రీమంతుడు తర్వాత కొరటాలతో మహేష్ చేస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకుండగా జీరో కట్స్ తో ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను జారీచేయడం విశేషం.

  వినోదానికి సందేశాన్ని జోడించి కొరటాల సిద్ధం చేసిన ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలోను ఆసక్తి వుంది. ఈ సినిమాకి ముందు కొరటాల తెరకెక్కించిన అన్ని సినిమాలు ఘన విజయాలను సాధించాయి. ఆ సక్సెస్ ల జాబితాలో 'శ్రీమంతుడు' కూడా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో మహేశ్ వుంటే, ఈ సినిమా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందనే ఆశతో కైరా అద్వాని వుంది.       

loader