భారతీయుడికి చావే లేదట.. `భారతీయుడు 2` ఇంట్రో అదిరింది..
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో దాదాపు 27ఏళ్ల తర్వాత వస్తోన్న చిత్రం `భారతీయుడు 2`. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. తాజాగా ఇంట్రో వదిలారు. క్రేజీగా ఉంది.

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వచ్చిన `భారతీయుడు` సంచలన విజయం సాధించింది. 27 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు `భారతీయుడు 2` రూపొందుతుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది. `భారతీయుడు` ఇంట్రో పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేశారు.
ఇందులో గత సినిమాని గుర్తు చేస్తూ `ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను.. భారతీయుడికి చావే లేదు` అనే కమల్ డైలాగ్‌తో ప్రారంభమైంది. వరుసగా అవనీతి, అక్రమాలను చూపించారు. ఎక్కడ చూసినా లంచం, లంచం, ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో లంచగొండి తనం నడుస్తుంది. కోట్లల్లో డిమాండ్ పెరిగింది. అప్పుడే సైన్ పెడతామని, లేదంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నారు.
దీంతో జనం నుంచి డిమాండ్ పెరుగుతుంది. భారతీయుడు మళ్లీ రావాలని, కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ జనం నినాదాలు చేస్తున్నారు, రోడ్డలపైకి వస్తున్నారు. దీంతో ఎట్టకులకే భారతీయుడు వచ్చాడు. తనదైన వేలి పంచ్‌లతో క్రేజీగా ఎంట్రీ ఇచ్చాడు. నమస్తే ఇండియా, భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటూ ఆయన చివర్లో చెప్పిన డైలాగు ఆకట్టుకుంది. సినిమా కథేంటో తెలియజేసేలా ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ ఇంట్రో ఉంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రం కొంత సుభాష్ చంద్రబోస్ కోణంలో సాగుతుందని ఇంట్రోని బట్టి తెలుస్తుంది. ఇంట్రోలోనూ సుభాష్ చంద్రబోస్ ఫోటో తర్వాత కమల్ ఇండియన్ గా ఎంట్రీ ఇచ్చారు. చివర్లో సైన్యాన్ని చూపించారు. అది ఆసక్తికరంగా మారింది. ఇందులో కమల్.. వీరశేఖరన్ సేనాపతిగా కనిపించబోతున్నారు. లంచంపై ఆయన పోరాడబోతున్నారు. సమకాలీన అంశాలను ప్రతిబింబించేలా సినిమా సాగుతుందని తెలుస్తుంది.
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లైకా, రెడ్ గెయింట్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్‌ని ఇంకా ప్రకటించలేదు. సంక్రాంతికి గానీ, లేదంటే 26 జనవరికిగానూ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.